• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HUSBAND STABS HIS WIFE SEVERAL TIMES IN VIKARABAD WIFE OUT OF DANGER MU

Husband Stabs Wife: మాట్లాడదామని భార్యను పిలిచి.. ఆపై కత్తితో పొడిచి..

Husband Stabs Wife: మాట్లాడదామని భార్యను పిలిచి.. ఆపై కత్తితో పొడిచి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మద్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. తన మాట వినడం లేదనే కోపంతో ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు.

  • News18
  • Last Updated:
  • Share this:
    కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పెళ్లికి ముందు ఊసులు చెప్పిన భర్తే.. ఆమె ఊపిరి తీయబోయాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వాటిని పరిష్కరించుకోవాల్సింది పోయి భార్యను హత్య చేయబోయాడో కిరాతక భర్త. వికారాబాద్ లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
    హైదరాబాద్ లోని నాంపల్లికి చెందిన వెంకటేశ్.. శంకర్ పల్లి మండలం అంతప్పగూడ కు చెందిన సుజాతలు నాలుగేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉన్నట్టుండి వారి కాపురంలో కలహాలొచ్చాయి. దీంతో చాలారోజులుగా ఇద్దరు విడిపోయి వేరువేరుగా బతుకుతున్నారు. భార్య వికారాబాద్ లో ఉంటుండగా.. వెంకేటేశ్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. నిందితుడు తనను మోసం చేశాడంటూ ఐపీసీ సెక్షన్ 408 (చీటింగ్) కింద ఆమె వికారాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    విషయం తెలుసుకున్న వెంకటేశ్.. తన భార్య పనిచేస్తున్న వికారాబాద్ లోని షాపునకు వెళ్లాడు. మాట్లాడదామని చెప్పి ఆమెను బయటకు రమ్మన్నాడు. కేసు వాపసు తీసుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఇదే క్రమంలో మాటా మాటా పెరిగి ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన వెంకటేశ్.. భార్యపై కత్తితో దాడి చేశాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా.. జాలి, దయ మరిచి ఆమెపై పలుమార్లు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలైన సుజాతను స్థానికులు వికారాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

    కాగా, ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయింది. వెంకటేశ్ కత్తితో పొడిచేపుడు బాధితురాలు తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతడు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. రక్తాలు కారినా కనికరం చూపలేదు. దుకాణంలో ఉన్నవారు ఇది గమనించి అక్కడికి రావడంతో నిందితుడి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేగింది.
    Published by:Srinivas Munigala
    First published:

    అగ్ర కథనాలు