Home /News /crime /

HUSBAND STABBED HIS WIFE TO DEATH ON THE SUSPICION THAT SHE WAS HAVING AN AFFAIR SSR

Husband: సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తను వెళ్లగానే ఇంట్లో భార్య ఏదో చేస్తుందన్న డౌట్‌తో..

రాహుల్, గౌరి

రాహుల్, గౌరి

భార్యాభర్తల బంధానికి పునాదే నమ్మకం. ఆ నమ్మకమే లేకపోతే ఆ బంధానికి విలువే లేదు. ఒకరినొకరు నమ్మి, అర్థం చేసుకుంటూ.. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకున్నప్పుడే ఆ దంపతుల జీవితం కలకాలం కలతలు లేకుండా సాగుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరిలో అయినా అనుమానం మొదలైతే.. అది కలహాల కాపురమే అవుతుంది.

ఇంకా చదవండి ...
  పింప్రి-చించివాడ్: భార్యాభర్తల బంధానికి పునాదే నమ్మకం. ఆ నమ్మకమే లేకపోతే ఆ బంధానికి విలువే లేదు. ఒకరినొకరు నమ్మి, అర్థం చేసుకుంటూ.. ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకున్నప్పుడే ఆ దంపతుల జీవితం కలకాలం కలతలు లేకుండా సాగుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరిలో అయినా అనుమానం మొదలైతే.. అది కలహాల కాపురమే అవుతుంది. అలాంటి సందర్భంలో క్షణికావేశంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయి. పుణెలో ఓ జంట విషయంలో ఇదే జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. చివరికి భార్యను కోల్పోయి కటకటాల్లో ఊచలు లెక్కబెడుతూ బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పింప్రి-చించివాడ్ ప్రాంతానికి చెందిన రాహుల్ గోకుల్ ప్రతాప్‌కు, గౌరికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. రాహుల్ అదే ప్రాంతంలో ఒక దగ్గర సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గౌరి వయసు ప్రస్తుతం 21 సంవత్సరాలు. ఆమెను 18 ఏళ్ల వయసులోనే రాహుల్‌కు ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లైన కొన్ని నెలలు అన్యోన్యంగానే ఉన్న ఈ జంట ఆ తర్వాత చిన్నచిన్న విషయాలకే గొడవ పడుతూ ఉండేవారు. ఆమెకు వేరెవరితోనో వివాహేతర సంబంధం ఉందని రాహుల్ అనుమానపడుతూ ఉండేవాడు. ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు.

  ఆమె అలిగి పుట్టింటికి వెళ్లి కొన్నిరోజులకు తిరిగొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే మాదిరిగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన గౌరి గత మంగళవారం భర్త దగ్గరకు తిరిగి వెళ్లేందుకు బయల్దేరింది. ఆమె వస్తుండటాన్ని చూసి రాహుల్ వీధిలోనే తిట్టికొట్టి చేయి చేసుకున్నాడు. ఈసారి గొడవ ముదిరి చిలికిచిలికి గాలివానగా మారింది. ఆమెపై పెంచుకున్న అనుమానం రాహుల్‌కు మరింత ముదిరింది. ఓ పదునైన కత్తితో ఆమె తలపై పదేపదే దాడి చేశాడు. రాత్రి 9.30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గౌరిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో వీధిలో చాలామంది చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ రాహుల్‌ను ఆపేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం.

  ఇది కూడా చదవండి: Shocking Incident: ఆంటీతో హాస్పిటల్‌కు యువకుడు.. సడన్‌గా కడుపునొప్పి.. ఇంజెక్షన్ ఇవ్వగానే ఊహించని ఘటన..

  ఏ ఒక్కరు మానవత్వంతో స్పందించి రాహుల్‌ను ఆపినా గౌరి ప్రాణం దక్కేది. పోలీసులు రాహుల్‌ను అరెస్ట్ చేసి అతనిపై హత్య కేసు నమోదు చేశారు. సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న రాహుల్ పని గంటలు ఎక్కువగా ఉండటంతో ఈలోపు భార్య ఎవరితోనో అఫైర్ కొనసాగిస్తుందని అనుమానించేవాడని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు. గౌరి అలాంటి పని చేయకపోయినా ఆమెను రోజూ అనుమానిస్తూ వేధించేవాడని చెప్పారు. రాహుల్‌కు, గౌరికి పెళ్లై మూడున్నరేళ్లయినా పిల్లలు లేరు. దీంతో.. రాహుల్‌కు తన భార్య తప్పు చేస్తుందేమోనన్న అనుమానం మరింత బలపడింది. ఇలా భార్య విషయంలో పూర్తి నెగిటివ్‌గా ఆలోచించి.. ఆమెను చంపి.. చివరికి తన జీవితాన్ని కూడా రాహుల్ నాశనం చేసుకున్నాడు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Extra marital affair, Husband, Husband kill wife, Pune news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు