హోమ్ /వార్తలు /క్రైమ్ /

అర్ధరాత్రి ఫోన్ మాట్లాడినందుకు.. ఆ సంబంధం పెట్టుకుందేమోననే అనుమానంతో భార్య గొంతుకోసిన భర్త

అర్ధరాత్రి ఫోన్ మాట్లాడినందుకు.. ఆ సంబంధం పెట్టుకుందేమోననే అనుమానంతో భార్య గొంతుకోసిన భర్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్య రాత్రి పూట ఫోన్ మాట్లాడటం ఆ భర్త తట్టుకోలేకపోయాడు. ఫోన్ మాట్లాడటం మానుకోవాలని సూచించాడు. అయినప్పటికీ ఆమె ఆ అలవాటును మానలేదు. దీంతో ఆమె.. వివాహేతర సంబంధం నడుపుతుందని ఆ భర్త అనుమానించాడు. ఈ క్రమంలోనే...

  • News18
  • Last Updated :

వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడు సంవత్సరాల క్రితం వీరికి పెళ్లయింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు. సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో హఠాత్తుగా ఆలుమగల మధ్య అనుమానాలు పెడచూపాయి. భార్య రాత్రి పూట ఫోన్ మాట్లాడటం ఆ భర్త తట్టుకోలేకపోయాడు. ఫోన్ మాట్లాడటం మానుకోవాలని సూచించాడు. అయినప్పటికీ ఆమె ఆ అలవాటును మానలేదు. దీంతో ఆమె.. వివాహేతర సంబంధం నడుపుతుందని ఆ భర్త అనుమానించాడు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం రాత్రికి ఇంటికి వచ్చిన సమయంలో కూడా ఆమె ఫోన్ మాట్లాడుతుండటం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఆ తర్వాత దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది.

వివరాలు కింది విధంగా ఉన్నాయి. బెంగళూరులోని తవరేకెరే ప్రాంతంలో వెలుగుచూసిందీ ఘటన. రఘుకిరణ్.. సుస్మిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొద్దికాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నది. ఇదే క్రమంలో రాత్రి పూట ఫోన్ సుస్మితా తరుచూ ఫోన్ మాట్లాడేది. ఇది చూసి రఘు కిరణ్ ఒళ్లు మండిపోయేది. ఫోన్ మాట్లాడటం మానుకోవాలని గతంలో కొన్ని సార్లు చెప్పినా భార్య వినలేదు.

ఈ క్రమంలో శనివారం రాత్రి రఘుకు శరీరంలో అలసటగా ఉంటే షాప్ నుంచి ఇంటికి వచ్చాడు. అతడు వస్తున్న సమయంలో ఆమె ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉంది. దీంతో చిర్రెత్తుకుపోయిన రఘు.. ఫోన్ పక్కనపెట్టాలని సూచించాడు. కానీ దానికి సుస్మిత స్పందిస్తూ... తాను ముఖ్యమైన కాల్ లో ఉన్నానని.. కాసేపయ్యాక చేస్తానని చెప్పింది. దీంతో రఘులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భార్య వివాహేతర సంబంధం నడుపుతుందని.. తన మాట వినడంలేదనే కోపంతో కిచెన్ లోకి వెళ్లి పదునైన కత్తి తీసుకొచ్చి ఆమె గొంతు కోసేశాడు. దీంతో ఆమె అక్కడే కింద పడిపోయి రక్తపు మడుగులో కొట్టుకుని.. ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచింది.

భర్తను చంపిన అనంతరం.. సుస్మిత ఇంటికి వెళ్లి ఆమెను చంపివేశానని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో వెంటనే సుస్మిత దగ్గరకు ఆమె సోదరుడు పరిగెత్తుకుని వచ్చాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

First published:

Tags: Bengaluru, Crime, Crime news, Husband kill wife, Illegal affair, Karnataka, Murder

ఉత్తమ కథలు