భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుందని.. బండరాయితో మోది..

పది సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే సతీష్ చందానగర్‌లోని ఓ బంగారం దుకాణంలో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు.

news18-telugu
Updated: May 27, 2020, 7:12 AM IST
భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుందని.. బండరాయితో మోది..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనుమానం అమె పాలిట పెనుభూతమైంది. భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానించాడు భర్త. అది మనస్సులో పెట్టుకుని తాగొచ్చి భార్యను బండరాయితో మోది చంపేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి భార్యను చంపానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వెన్నకోట సతీష్, జయలక్ష్మి(32) భార్యభర్తలు. పది సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్‌లో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే సతీష్ చందానగర్‌లోని ఓ బంగారం దుకాణంలో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య జయలక్ష్మి సమీపంలోని హిల్‌కౌంటీ కాలనీలో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. అయితే తన భార్య నిత్యం ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమలోనే మద్యం తాగి వచ్చాడు. కొడుకులిద్దరూ బయటకు వెళ్లడంతో ఆమెతో గొడవపడి తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం బాచుపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సతీష్.. తన భార్యను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయాడు.
First published: May 27, 2020, 7:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading