కూరలో ఉప్పులేదని భార్యకు గుండు చేసిన భర్త...

మధ్యాహ్నం భోజనం వడ్డించగా. వడ్డించిన కూరలో ఉప్పు సరిపోలేదు. దీంతో భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. కోపంతో ఆమెను చితకబాదాడు. అంతటితో ఆగలేదు. భార్యను బలవంతంగా కూర్చోబెట్టి బ్లేడుతో గుండు చేశాడు.

news18-telugu
Updated: October 9, 2019, 10:59 PM IST
కూరలో ఉప్పులేదని భార్యకు గుండు చేసిన భర్త...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 9, 2019, 10:59 PM IST
కూరలో ఉప్పులేదని కోపంతో ఓ భర్త, తన భార్యకు గుండు కొట్టించిన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుమార్ అనే వ్యక్తికి మధ్యాహ్నం భోజనం వడ్డించగా. వడ్డించిన కూరలో ఉప్పు సరిపోలేదు. దీంతో భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. కోపంతో ఆమెను చితకబాదాడు. అంతటితో ఆగలేదు. భార్యను బలవంతంగా కూర్చోబెట్టి బ్లేడుతో గుండు చేశాడు. ఆమె రక్తమోడుతున్న తలతో బయటకు వచ్చింది. ఇది చూసిన చుట్టుపక్కల వారు నిందితుడిని నిలదీశారు. నా ఇష్టమని అడ్డొస్తే ఎవరినైనా సరే బ్లేడుతో గాయపరుస్తానని బెదిరించాడు. అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు.

First published: October 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...