Home /News /crime /

HUSBAND SHAVES WIFE HAIR AS SHE GIVEN BIRTH TO GIRL CHILD PVN

Husband : భార్య జుట్టు కత్తిరించి గుండు చేసిన భర్త..ఎందుకో తెలిస్తే వాడిని కోసి కారంపెడతారు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Husband shaves wife hair : మూడు నెలల క్రితం రకియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాము మగపిల్లవాడు పుట్టాలని అనుకుంటే ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో రకియాను భర్త,అత్తమామలు మానసికంగా వేధించేవాళ్లు. పుట్టేది ఆడో,మగో తన చేతుల్లో ఎలా ఉంటుందని రకియా చెప్పినా వినకుండా ఆమెను మానసికంగా తీవ్ర వేధనకు గురిచేశారు.

ఇంకా చదవండి ...
Husband shaves wife hair : వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్(Murshidabad)లో ఓ వ్యక్తి..తన భార్య జుట్టు కత్తిరించి ఆమెకు షేవింగ్ చేశాడు. దీనికి కారణం ఆమె ఆడపిల్లకు(Girl Chid)జన్మనివ్వడమే. ముర్షిదాబాద్‌లోని హరిహరపరాలోని సాలూవా గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముర్షిదాబాద్ లోని సాలువా గ్రామంలో నివసించే రకియా-అబ్దుల్లా షేక్ భార్యాభర్తలు. మూడు నెలల క్రితం రకియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాము మగపిల్లవాడు పుట్టాలని అనుకుంటే ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో రకియాను భర్త,అత్తమామలు మానసికంగా వేధించేవాళ్లు. పుట్టేది ఆడో,మగో తన చేతుల్లో ఎలా ఉంటుందని రకియా చెప్పినా వినకుండా ఆమెను మానసికంగా తీవ్ర వేధనకు గురిచేశారు. రకియాను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. పుట్టిన ఆడబిడ్డను చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో గురువారం ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు రకియాను ఆమె భర్త అబ్దుల్లా షేక్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత రకియాను తలపై కాల్చి వివస్త్రను చేశాడు.

అబ్దుల్లా తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండగా, రాకియా మామ, అత్తగారు ఆ దృశ్యాన్ని కళ్లు అప్పగించి చూశారే తప్ప కొడుకుని ఆపే ప్రయత్నం చేయలేదు. రకియా జుట్టు కత్తిరించి,ఆమెకు షేవింగ్ చేశాడు భర్త. ఈ నేపథ్యంలో రకియా పోలీసులను ఆశ్రయించింది. నా భర్తను కఠినంగా శిక్షించాలంటూ పోలీస్‌స్టేషన్‌ ముందు రకియా కేకలు వేసింది. నాకు జరిగినది మరెవరికీ జరగకూడదనుకుంటున్నాను అంటూ భోరున విలపించింది. రకియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త అబ్దుల్లా షేక్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.

Terrific Video : ఎందుకమ్మా ఆ ఎచ్చులు..రైలులో డోర్ దగ్గర నిలబడేవాళ్లు ఈ అమ్మాయి వీడియో చూడండి!

మరోవైపు, పవిత్రమైన నదిలో స్నానం (Ayodhya River) చేస్తు ఒక జంట రొమాన్స్ చేస్తు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) ఈ ఘటన జరిగింది. పవిత్రమైన అయోధ్య నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో ఇద్దరు భార్యభర్తలు నదిలో స్నానం (Ayodhya kissing wife) చేయడానికి దిగారు. ఆ తర్వాత.. వారు చుట్టు పక్కన నదిలో జనాలు ఉన్నారన్న విషయం కూడా మరిచిపోయారు. ఒకరిని మరోకరు హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకుంటున్నారు. దీన్ని కొంత మంది భక్తులు గమనించారు. వెంటనే వారి దగ్గరకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని.. నదినుంచి బైటకు లాగారు. ఒడ్డుమీద తీసుకెళ్లి .. పొట్టు పొట్టు కొట్టారు. అతని..భార్య జనాలను ఆపాలని చూసి ఎవరు వినిపించుకోలేదు. మనోడి.. చెంపలు, వీపు విమానం మోత మోగించారు. దీనిపై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన నదిలో ఇలాంటి పాడు పనులను సహించబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (social media) వైరల్ గా (Viral video) మారింది. ఘటనపై అయోధ్య ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని స్థానిక పోలీసులు ఆదేశించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: West Bengal, Wife and husband

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు