పెళ్లి చూపుల్లో అబద్ధం చెప్పి మోసం చేసింది.. విడాకులివ్వండంటూ హైకోర్టుకు వెళ్లిన భర్త.. అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

‘నా భార్య నన్ను మోసం చేసింది. పెళ్లి చూపుల్లో అబద్ధం చెప్పింది. ఆమెతోపాటు నా అత్తమామలు కూడా అబద్ధం చెప్పారు. అందుకే ఆమెతో నేను కలిసి ఉండలేను. విడాకులు ఇప్పించండి‘ అంటూ హైకోర్టు మెట్లెక్కాడో భర్త.

 • Share this:
  ‘నా భార్య నన్ను మోసం చేసింది. పెళ్లి చూపుల్లో అబద్ధం చెప్పింది. ఆమెతోపాటు నా అత్తమామలు కూడా అబద్ధం చెప్పారు. అందుకే ఆమెతో నేను కలిసి ఉండలేను. విడాకులు ఇప్పించండి‘ అంటూ హైకోర్టు మెట్లెక్కాడో భర్త. అతడి సుదీర్ఘ వాదనను విన్న హైకోర్టు అతడి పిటిషన్ ను అడ్డంగా కొట్టేసింది. ఇలాంటి చిత్ర విచిత్ర కారణాలతో విడాకులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. బాంబే హైకోర్టులోని నాగ్ పూర్ బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. ఇంతకీ అతడికి పెళ్లిచూపుల్లో ఆమె చెప్పిన అబద్ధమేంటనే కదా మీ డౌటు. అక్కడికే వెళ్దాం. ముంబైలోని ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. అతడికి జాతకాలపై నమ్మకం ఎక్కువ. పెళ్లి తర్వాత అతడికి ఎందుకో అనుమానం వచ్చింది. పెళ్లి సమయంలో తన భార్య తన పుట్టిన రోజును తప్పుగా చెప్పారని అతడిలో అనుమానం కలిగింది.

  ఆమె తల్లిదండ్రులు కూడా నిజాన్ని కప్పిపుచ్చి అబద్ధపు పుట్టిన రోజును చెప్పారని అతడి నమ్మకం. జాతకం ప్రకారం ఆమె ’మంగలిక్‘(అంగారక రాశి ప్రభావం వల్ల పుట్టిన వాళ్లు) కాదని, తనకు అబద్ధం చెప్పి మోసం చేశారని అతడు మొదటగా ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కాడు. తనకు విడాకులు ఇవ్వమని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతడి పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో అతడు బాంబే హైకోర్టు మెట్లెక్కాడు. అక్కడ అతగాడి వాదనను విన్న జస్టిస్ ఏఎస్ చంద్రుర్కర్, ఎన్బీ సూర్యవంశీ ధర్మాసనం, తుది తీర్పును గురువారం వెల్లడించింది.
  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

  ’పెళ్లి నాటి నుంచి నన్ను చిత్రహింసలు పెడతున్నారు. వివిధకారణాలతో హింసిస్తున్నారు. నేనేమీ నా పుట్టిన రోజును అబద్ధం చెప్పలేదు. నా సర్టిఫికెట్లలో కూడా ఇదే ఉంది. దానికి సంబంధించిన ఆధారాలను మీకు అందజేస్తున్నాను. నాకు న్యాయం చేయండి‘ అంటూ అతడి భార్య వాదనను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అయితే పుట్టినరోజును మార్చినట్టు ఆధారాలను భర్త సమర్పించలేకపోవడం, భార్య తరపు అన్ని ఆధారాలు ఉండటంతో విడాకుల పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇలాంటి చిత్ర విచిత్ర కారణాలతో విడాకులు అడగటం అసంబ్ధమని తేల్చిచెప్పింది. కాగా ఇటీవల ఇలాంటిదే మరో విడాకుల కేసు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తన భర్త పెళ్లప్పుడు ఆస్ట్రేలియాకు తీసుకెళ్తానని చెప్పాడనీ, దాన్ని నెరవేర్చనందున విడాకులు ఇప్పించాలని ఓ భార్య కోర్టు మెట్లెక్కింది.
  ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!
  Published by:Hasaan Kandula
  First published: