హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: కాపురానికి తీసుకెళ్లమన్న భార్యను స్నేహితులతో కలిసి..!

Andhra Pradesh: కాపురానికి తీసుకెళ్లమన్న భార్యను స్నేహితులతో కలిసి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), గుంటూరులో (Guntur) అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యకు రక్షణగా ఉండాల్సిన వాడు భర్త. కానీ అతడే నీతి తప్పి ప్రవర్తించారు. భార్యమానాన్ని కాపాడాల్సిన వాడు.. స్నేహితులతో కలిసి అత్యాతారానికి పాల్పడ్డాడు.

  దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బయటివాళ్లే కాదు నా అనుకున్నవాళ్లే అకృత్యాలకు పాల్పడుతున్నారు. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యకు రక్షణగా ఉండాల్సిన వాడు భర్త. కానీ అతడే నీతి తప్పి ప్రవర్తించారు. భార్యమానాన్ని కాపాడాల్సిన వాడు.. స్నేహితులతో కలిసి అత్యాతారానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై కక్ష పెంచుకున్న అతడు.. ఈనీచానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని ఏటీ అగ్రహారానికి చెందిన మహిళకు ఏడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన వ్యక్తితే వివాహమైంది. పెళ్లయిన కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఇటీవలే అతను గుంటూరు రావడంతో భర్తను కలిసేందుకు బంధువుల పెళ్లికి వెళ్లింది. భర్తతో మాట్లాడేందుకు యత్నించగా ఇక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో భార్య తనపై డి చేయించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తనను కాపురానికి తీసుకెళ్లాలని అడిగేందుకు భర్త దగ్గరకు వెళ్లింది. అన్ని మర్చిపోయి జీవిద్దామని కోరింది. అదే సమయంలో స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న భర్త.. ఆమెను దుర్భాషలాడాడు. అక్కడితో ఆగలేదు విచక్షణ మరిచి భార్యపైనే స్నేహితులతో అత్యాచారం చేయించాడు. తాను ఎంతవేడుకుంటున్నా వినకుండా స్నేహితులను రెచ్చగొట్టి తనపై సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తతో పాటు అతని స్నేహితులను విచారిస్తున్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు.

  ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన భర్తపై మహిళ బంధువులు మండిపడుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra pradesh news, Gang rape, Guntur rape case

  ఉత్తమ కథలు