అనంతపురంలో ఘోరం.. ఫ్రెండ్స్‌తో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్

కట్టుకున్న భర్తే తన మిత్రులతో కలిసి భార్యపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డాడు. bdhn

news18-telugu
Updated: December 3, 2019, 7:01 PM IST
అనంతపురంలో ఘోరం.. ఫ్రెండ్స్‌తో కలిసి భార్యపై భర్త గ్యాంగ్ రేప్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశా హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోసారి ఇలాంటి ఘటన జరగకుండా వారిని నడిరోడ్డుపై చంపాలని అందరూ గళమెత్తుతున్నారు. అత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా.. దేశంలో పరిస్థితులు మారడం లేదు. కామాంధులు చెలరేగిపోతూనే ఉన్నారు. తాజాగా అనంతపురం జిల్లా కదిరిలో మరో ఘోరం వెలుగు చూసింది. కట్టుకున్న భర్తే తన మిత్రులతో కలిసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మల్లేష్ అనే వ్యక్తి సొంత భార్యపై అఘాయిత్యం చేశాడు. మల్లేష్, అతడి మిత్రులు కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. మద్యం మత్తులో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్ దిశా ఘటన మరవక ముందే కదిరిలో ఈ దారుణం జరగడం స్థానికంగా సంచలన రేపుతోంది. బాధితురాలి భర్త మల్లేష్ గతంలో ఓ బాలికను రేప్ చేసి జైలుకెళ్లి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>