హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.. ఆన్ లైన్లో న్యూడ్ ఫోటోలు

Andhra Pradesh: భార్యను అమ్మకానికి పెట్టిన భర్త.. ఆన్ లైన్లో న్యూడ్ ఫోటోలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తిరుపతి (Tirupathi)లో ఓ శాడిస్టు భర్త నిర్వాకం బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వ్యభిచారిగా ప్రచారం చేశాడు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టాడో శాడిస్టు భర్త. అగ్నిసాక్షిగా తాళికట్టిన భార్యను.. గంటల్లెక్కన పంపిస్తానంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.., తిరుపతికి చెందిన రేవంత్ కుమార్.., అదే ప్రాంతాకి చెందిన యువతిని ఈ ఏడాది అగస్టు 13న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బెంగళూరు తీసుకెళ్లి మరీ తాళి కట్టాడు. ఐతే ప్రేమించిన వాడిని మనువాడానన్న ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు. పెళ్లైన మూడో రోజు నుంచే ఆమెను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధిస్తున్నాడు. అక్కడితో అతడి ఆగడాలు ఆగలేదు. ఏకంగా భార్యపై అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఆమెను వ్యభిచారిగా చిత్రీకరించాడు.

భర్త పెట్టే వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిన భార్యకు రేవంత్ కుమార్ అక్రమ సంబంధాలు అంటగట్టాడు. పెళ్లైన వారానికే ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని  ప్రశ్నించినందుకు తనను అనుమానిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తన వ్యక్తిగత ఫోటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసినట్లు భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఐదు నెలలుగా భర్త ఆగడాలను భరించిన ఆమె దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐతే పోలీసులు కూడా తనకు న్యాయం చేయలేదని ఆమో వాపోయింది. ఎఫ్ఐఆర్ లో కూడా తాను చెప్పిన అంశాలు కాకుండా రేవంత్ వెర్షన్ ను నమోదు చేసుకున్నారని బాధితురాలు ఆరోపించింది.


తన భర్త వేధింపులను అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదని బాధితురాలు చెప్పింది. భర్త చేసిన చిత్రహింసలతో ఒంటిపై గాయాలయ్యాయని ఆమె చెప్తోంది. తమ కూతరు ఇష్టపడిందని పెళ్లి చేస్తే.. ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు చెప్తున్నారు. రేవంత్ బంధువుల్లో పోలీసులుండటంతో లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగక్కపోవడంతో బాధితురాలు తన బంధువులతో కలిసి రేవంత్ ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఐతే భార్య వస్తున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన రేవంత్ ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు మాత్రం లాయర్ దగ్గరకు వెళ్లినట్లు చెప్తున్నారు.

మరోవైపు రేవంత్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే బాధితురాలు ఎక్కడికెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రేవంత్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు మాత్రం రేవంత్ పై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షిస్తామన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Domestic Violence, Prostitution, Social Media

ఉత్తమ కథలు