హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఈ భార్యాభర్తల కేసులో ట్విస్టులు మామూలుగా లేవుగా.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అసలు నిజం చెప్పిన భర్త

ఈ భార్యాభర్తల కేసులో ట్విస్టులు మామూలుగా లేవుగా.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అసలు నిజం చెప్పిన భర్త

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పోలీసులు ఎంట్రీ ఇచ్చి, ఆమెను, వారి కుటుంబ సభ్యులను అక్కడకు పంపించారు. అసలేం జరిగిందని మీడియా ప్రతినిధులు ఆ భర్తను అడిగితే అసలు విషయం చెప్పేశాడు. తనపై పెట్టిన అదనపు కట్నం వేధింపుల కేసు అసలు కథేంటో తేల్చేశాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను ఎందుకు టార్గెట్ గా చేసుకున్నారో వెల్లడించాడు. ఇంతకీ అసలు కథేంటంటారా..?

ఇంకా చదవండి ...

హైదరాబాద్, సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్. అక్కడ ఓ వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టాడు. అలా అని అతడేమీ సెలబ్రెటీ కాదు. అదనపు కట్నం వేధింపుల కేసును ఎదుర్కొంటున్న ఓ సగటు భర్త. అతడు ప్రెస్ మీట్ పెడుతున్న విషయం తెలుసుకుని అతడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. నానా రభస సృష్టించారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి, ఆమెను, వారి కుటుంబ సభ్యులను అక్కడకు పంపించారు. అసలేం జరిగిందని మీడియా ప్రతినిధులు ఆ భర్తను అడిగితే అసలు విషయం చెప్పేశాడు. తనపై పెట్టిన అదనపు కట్నం వేధింపుల కేసు అసలు కథేంటో తేల్చేశాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను ఎందుకు టార్గెట్ గా చేసుకున్నారో వెల్లడించాడు. ఇంతకీ అసలు కథేంటంటారా..?

ఈ నెల 11 వ తారీఖున సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో లావణ్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ’నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని నా భర్త వేధిస్తున్నాడు. అదనపు కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నాడు. అత్తమామలు కూడా చిత్రహింసలు పెడుతున్నారు. నన్ను కాపురానికి తీసుకెళ్లడం లేదు. నా భర్తపై నేను అదనపు కట్నం, వేధింపుల కేసును పెడుతున్నా..‘ అంటూ లావణ్య విలేకరుల ఎదుట వాపోయింది. తన కష్టాలను చెప్పుకుని బోరుమని ఏడ్చింది. తనకు న్యాయం చేయాల్సిందిగా కోరింది. ఈ ఘటన జరిగిన సరిగ్గా పది రోజులకు అదే ప్రెస్ క్లబ్ కు ఆమె భర్త సంతోష్ కుమార్ వచ్చాడు.

భార్య లావణ్య ప్రెస్ మీట్ పెట్టిన చోటే భర్త సంతోష్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. విలేకరుల ఎదుట అసలు నిజాన్ని చెప్పేశాడు. ’నా భార్య చెబుతున్నట్టు నేనేం అదనపు కట్నం కోసం వేధించడం లేదు. అలాంటి ఆశ కూడా నాకు, నా కుటుంబ సభ్యులకు లేదు. నా కూతుళ్లను పోషించుకునే శక్తి నాకు ఉంది. నేను నా భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆమే రావడం లేదు. నన్ను ఇల్లరికం ఉండమని వేధిస్తున్నారు. నాకు ఇల్లరికం ఉండటం ఇష్టం లేదు. అందుకే వాళ్లు నా మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు వచ్చినా సరే, నా భార్యను నేను కాపురానికి తీసుకెళ్తాను‘ అని సంతోష్ తేల్చిచెప్పాడు. మొత్తానికి ఇల్లరికం ఉండకపోవడం వల్లే, తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న విషయాన్ని బయటపెట్టాడు. మరి ఈ భార్యాభర్తల మధ్య వివాదం, ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో వేచిచూడాలి.

First published:

Tags: Crime news, Crime story, Wife kill husband

ఉత్తమ కథలు