వారికి 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా, ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నా ఆమె సంతానం మాత్రం కలగలేదు. ఇదే విషయమై భర్త తరచూ ఆమెతో గొడవపడేవాడు. పిల్లలు పుట్టకపోవడంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. పిల్లలు పుట్టని భార్య తనకు వద్దనుకున్నాడా భర్త. చంపేయాలన్న నిర్ణయానికి వచ్చేశాడు. అంతే, తెల్లవారుజామున నిద్రపోతున్న భార్యపై పెట్రోల్ పోశాడు. ఆమె గ్రహించి తేరుకునేలోపే నిప్పంటించి పరారయ్యాడు. తెల్లవారుజామునే ఇంటి నుంచి మంటలు వస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికే ఆమె సజీవ దహనం అయింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్రం పట్టణ శివారులోని అక్కలాయి గూడేనికి చెందిన పరశురామ్ అనే వ్యక్తి మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి చిట్యాల మండలం తాళ్లవెల్లెంలకు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితమే పెళ్లయింది. సంతానం కోసం జ్యోతి చేయని ప్రయత్నమే లేదు. అయినప్పటికీ ఆమెకు సంతాన భాగ్యం కలగలేదు. డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎందరో దేవుళ్లకు మొక్కినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సంతానం కలగకపోవడంపై ఆ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పిల్లలు కలగని భార్య తనకు వద్దు అనుకున్నాడు. ఆదివారం రాత్రి పూట కూడా సంతానం విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..
సంతానం కలగకపోవడానికి కారణం నువ్వంటే నువ్వంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే గొడవ సద్దుమణిగింది. అయితే పరుశురామ్ మాత్రం ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. చివరకు తెల్లవారుజామున నిద్రపోతున్న భార్యపై పెట్రోల్ పోశాడు. ఆ భార్య మేల్కొనేలోపే నిప్పంటించి తలుపులు వేసి మరీ ఇంటి నుంచి పరారయ్యాడు. స్థానికులు మంటలను గ్రహించి ఇంట్లోకి వచ్చి రక్షించేలోపే ఆమె సజీవ దహనం అయింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాజీవ్‌తో ప్రేమ పెళ్లికి ఒకే ఒక్క కండీషన్ పెట్టిన దేవదాస్ కనకాల.. నేరుగా సుమ ఫోన్ చేసి చెప్తే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Hyderabad, Nalgonda, Telangana, Wife kill husband