భార్య రహస్య చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్‌మెయిల్ చేసిన భర్త...

ఈ మధ్యకాలంలో బాధితురాలకి వాట్సప్ ద్వారా ఆమె పర్సనల్ ఫోటోలు రావడం మొదలైంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తానని సైతం ఆమె భర్త బెదిరించాడు.

news18-telugu
Updated: September 9, 2019, 3:14 PM IST
భార్య రహస్య చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్‌మెయిల్ చేసిన భర్త...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యతో కలిసి దిగిన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి నానా రచ్చ చేసిన భర్తను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే...గురుగ్రామ్ లో నివాసం ఉంటున్న బాధిత మహిళకు 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇద్దరూ చెరో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా దంపతులిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారిరువురూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు తగ్గట్టుగానే న్యాయస్థానాన్ని ఆశ్రయించి విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో బాధితురాలకి వాట్సప్ ద్వారా ఆమె పర్సనల్ ఫోటోలు రావడం మొదలైంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తానని సైతం ఆమె భర్త బెదిరించాడు.

ఇద్దరు వివాహ బంధంలో ఉన్నప్పటి రహస్య ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. దీంతో చేసేదేమి లేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని ఆమె చేసిన ఫిర్యాదు నేపథ్యంలోనే నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading