Home /News /crime /

HUSBAND PHONE CALL TO HIS WIFE FROM VEGETABLE MARKET HERE IT IS WHAT HAPPEND NEXT SSR

Wife: భర్త కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు.. భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు.. డౌటొచ్చి..

ఇంద్రాణి (ఫైల్ ఫొటో)

ఇంద్రాణి (ఫైల్ ఫొటో)

తమిళనాడులో ఘోరం జరిగింది. రాజపాళయంలో పట్టపగలు ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనలో రాజపాళయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. విరుధునగర్ జిల్లా రాజపాళయంలోని దురైస్వామిపురం వీధిలో గణేశన్ కుటుంబం నివాసం ఉంటోంది.

ఇంకా చదవండి ...
    రాజపాళయం: తమిళనాడులో ఘోరం జరిగింది. రాజపాళయంలో పట్టపగలు ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనలో రాజపాళయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. విరుధునగర్ జిల్లా రాజపాళయంలోని దురైస్వామిపురం వీధిలో గణేశన్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇంద్రాణి, గణేశన్ భార్యాభర్తలు. వీళ్లకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. గణేశన్‌కు ఓ కిరాణా దుకాణం ఉంది.

    భార్యాభర్తలిద్దరూ ఆ షాప్ చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గణేశన్ కూరగాయలు తీసుకొచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. భర్త లేని సమయంలో దుకాణం చూసుకుంటుండే ఇంద్రాణి ఎప్పటిలానే దుకాణంలో కూర్చుని ఉంది. బయట తుంపరల మాదిరిగా చినుకులు పడుతున్నాయి. సమయం ఉదయం 11 గంటలు అవుతోంది. వర్షం పడుతూ ఉండటంతో రోడ్డుపై కూడా ఎవరూ పెద్దగా తిరగడం లేదు.

    ఇది కూడా చదవండి: 15 Days Before the Wedding: 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఏం పనిది.. ఇలాంటోళ్లను ఏమనాలి అసలు..

    ఇంద్రాణి దుకాణంలో ఉండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ షాప్‌లోకి వెళ్లాడు. ఇంద్రాణి గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. పిల్లలు కూడా ఇంట్లో ఉండటంతో షాప్‌లో తల్లి రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించలేదు. గణేశన్ కూరగాయల మార్కెట్‌కు వెళ్లి అక్కడి నుంచి భార్య ఇంద్రాణికి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసి ఒక్కసారి తన భార్యకు ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఆ వ్యక్తి దుకాణానికి వెళ్లి చూడగా ఇంద్రాణి రక్తపుమడుగులో గొంతు కోసి ఉన్న స్థితిలో కనిపించింది. అది చూసిన పక్కింటి వ్యక్తి ఒక్కసారిగా షాకయ్యాడు. ఇంద్రాణి గొంతు కోసిన స్థితిలో పడి ఉందని చెప్పడంతో గణేశన్ హుటాహుటిన మార్కెట్ నుంచి షాప్‌కు వచ్చి చూశాడు. అప్పటికే అతని భార్య తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు డీఎస్పీ రామకృష్ణన్‌తో సహా స్పాట్‌కు చేరుకున్నారు.

    WifeHusband: భార్యాభర్తలంటే కష్టసుఖాలను పంచుకోవాలి.. కానీ వీళ్లిద్దరు మాత్రం.. ఈ చండాలం గురించి ఏం చెప్తాం..!

    ఇంద్రాణిని తొలుత చూసిన పక్కింటి వ్యక్తిని విచారించారు. అతను వచ్చేసరికి ఎలాంటి స్థితిలో ఇంద్రాణి ఉందో ఆరా తీశారు. అసలు ఇంద్రాణిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో కేసు దర్యాప్తు సాగుతోంది. ఆమె భర్తను విచారించారు. ఇంద్రాణికి పరిచయం ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై పగ పెంచుకుని పక్కా ప్లానింగ్‌తో ఆమెను హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. పట్టపగలు జరిగిన ఈ దారుణ హత్యతో రాజుపాళయం ఉలిక్కిపడింది. ఇంద్రాణి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి హత్యకు గురి కావడంతో ఇంద్రాణి కొడుకు, కూతురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె భర్త కూడా గుండెలవిసేలా రోదించాడు. ఇంద్రాణికి ఎవరితోనైనా వ్యక్తిగత పరిచయలున్నాయేమోనన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chennai, Crime news, Tamilnadu, Wife murdered

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు