HUSBAND OFFERES HIS WIFE TO OTHERS TO PAY LOAN IN RAJASTAN PVN
Shocking : అలాంటోడని తెలియక పెళ్లి చేసుకుంది..ఊరోళ్లతో సంబంధాలు పెట్టుకోవాలంటూ భర్త ఒత్తిడి
ప్రతీకాత్మక చిత్రం
Husband Offered His Wife To Others: భార్యా-భర్తలు ఎలా ఉండాలంటే..ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు,నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి. మొత్తంగా భర్యా-భర్తలు కలకాలం కలిసి మెలిసి ఉండాలి.
Husband Offered His Wife To Others: భార్యా-భర్తలు ఎలా ఉండాలంటే..ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఒకరికొకరు తమ ఆలోచనలు,నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొని చెప్పుకోవాలి. మొత్తంగా భర్యా-భర్తలు కలకాలం కలిసి మెలిసి ఉండాలి. ఎలాంటి కష్టాలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకుసాగాలి. అయితే తాజాగా ఓ భర్త చేసిన పని అందరినీ షాక్ కు గురిచేసింది. తాగుడుకి బానిసైన భర్త..అప్పులు తీర్చలేక భార్యను రుణదాతలకు అప్పగించాడు. అప్పు ఇచ్చిన వారితో సంబంధాలు పెట్టుకోవాలని భార్యను బలవంతంగా చేశాడు. అయితే అందుకోని ఒప్పుకోని భార్యను చిత్రహింసలు గురిచేశాడు. ఈ అమానవీయ ఘటన రాజస్తాన్(Rajastan) రాష్ట్రంలోని చురు జిల్లాలో జరిగింది.
రాజస్తాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలోని సదర్కు చెందిన వ్యక్తితో గతేడాది ఫిబ్రవరిలో మహిళకు వివాహమైంది(Marriage). అయితే పెళ్లి అయిన మరుసటి రోజు నుంచే అత్తారింట్లో ఆ మహిళకు కష్టాలు మొదలయ్యాడు. భర్త తాగుబోతు అని తెలియక అతడితో మూడు ముళ్లు వేయించుకున్న ఆ అమాయకురాలిని.. వరకట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధించేవారు. మరోవైపు, మద్యానికి బానిసైన భర్త గ్రామంలో దొరికినకాడికి అప్పులు చేశాడు. అలా రూ.5 లక్షల పైనే అప్పులు చేశాడు. అయితే నెలలు గడుస్తున్నా అప్పులు తీర్చుకపోవడంతో..అప్పులు చెల్లించాలంటూ డబ్బులు ఇచ్చిన వారు అడగడం మొదలుపెట్టారు. ఫలితం లేకపోవడంతో ఇంటి మీదకు వచ్చారు అప్పుల్లోళ్లు.
దీంతో అప్పు ఇచ్చిన వారికి మహిళను అప్పగించారు కుటుంబ సభ్యులు. 2022 ఫిబ్రవరి 27న అప్పు ఇచ్చిన వారు తనను వేధింపులకు గురి చేశారని భర్తకు చెప్పింది. వారికి సహకరించకపోవడం వల్ల ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. తన భర్తే అప్పు ఇచ్చిన వారితో సంబంధాలు పెట్టుకోవాలని తనను బలవంతంగా చేశాడని, చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ మహిళ బుధవారం సదర్ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.