Andhra Pradesh: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. బలవంతంగా సూసైడ్ నోట్ రాయించి హత్య చేశాడు

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల ప్రేమ పెళ్లిల్లు పెటాకులు అవుతున్నాయి.. అయితే విడాకుల వరకు వెళ్లిన తరువాత ఎవరి జీవితం వారు బతుకుతున్నవారు ఎందరో ఉన్నారు.. కానీ కొన్ని ప్రేమ వివాహాలు హత్యకు కూడా దారి తీస్తుండడం శోచనీయం. ప్రేమే ప్రాణాలు తీస్తుంటే ఎలా? అది కూడా కట్టుకున్న మొగుడే కాలయముడై ప్రాణాలు తీస్తే.. మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది.

 • Share this:
  ఏడు అడుగులు వేశాడు.. చేతిలో చేయి వేసి ప్రామాణాలు చేశాడు. మెడలో మూడు ముళ్లు వేశాడు.. కడదాక తోడుంటానని చెప్పిన చేతులతో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు ఒక భర్త. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోవాల్సి వచ్చింది. పెళ్లికి ముందు ప్రేమ అంటూ వెంటపడ్డాడు. నువ్వు లేనిదే నేను లేను అన్నాడు. కానీ పెళ్లైన తరువాత అనుమానం అనే జబ్బుతో భార్యనే దారుణంగా హత్య చేశాడు...

  ఇటీవల అనుమానం పెద్ద జబ్బుగా మారి కాపురాలను కూల్చేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అయితే విడాకులు తీసుకున్న తరువాత కూడా చాలామంది ఎవరి జీవితం వారు బతుకున్నారు.. కానీ అనుమానం పెనుభూతమై భార్యనే హత్య చేసే భర్తలను ఏమనాలి.. అది కూడా ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన తరువాత అత్యంత కిరాతాకానికి ఒడిగట్టాడు ఓ భర్త.

  ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్యకు మొదటిలో చాలా హామీలు ఇచ్చాడు. కంటికి రెప్పలా చూసుకుంటాను అన్నాడు. కాలు కింద పెట్టనివ్వకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అన్నాడు. ఇలా హ్యాపీగా సాగుతున్నవారి సంసారంలో పిల్లలు పుట్టిన తరువాత అనుమానం అనే జబ్బు మొదలైంది. దీంతో వెనుక ముందు ఆలోచించకుండా కాలయముడయ్యాడు.

  భార్యను ఎవరైనా వేధిసతే ఆమెను కాపాడాల్సిన భర్తే ఇలా ప్రాణాలు తీయడం దారుణం. వద్దు వదిలేయండి ప్లీజ్.. అన్నా కనికరం చూపించలేదు. వేరే వారితో ఏదో సంబంధం ఉందని అనుమానించి.. కొట్టి కొట్టి చంపాడు. అయితే ఆ హత్య నుంచి తప్పించుకునేందుకు వేరొకరిపై నేరం మోపి ప్రయత్నం చేశాడు తెలివిగా. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

  చిత్తూరు జిల్లా పోలీసులు విచారణలో నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. నగరి మండలం నెత్తంకండ్రిగకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఆరేళ్ల మహీధర్, 4 ఏళ్ల బాబి అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే స్థానికంగా ఉండే టీచర్ గోపీ, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్ భానుప్రియపై కన్నేశారు.. రోజూ వేధింపులకు గురి చేసేవారు. ఆ విషయం భర్తకు చెప్పినా.. తిరిగి ఆమెపైనే అనుమానం పెంచుకున్నాడు. అక్కడి నుంచి వేధింపులకు గురి చేసేవాడు.

  భర్త వేధింపులపై 3రోజుల కిందటే భానుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా.. దీంతో ఆగ్రహించిన నారాయణమూర్తి చాలా పెద్ద స్కెచ్ వేశాడు. తెలివిగా తప్పించుకోవాలి అనుకున్నాడు. భార్యతో బలవంతంగా సూసైడ్‌ నోట్‌ రాయించి, ఉరేసి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  తరువాత ధనశేఖర్‌ ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసి తగులబెట్టేశాడు. పోలీసులు నారాయణ మూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడు నారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే భానుప్రియను వేధించిన గోపి, ధనశేఖర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్‌ ఇంటిపై దాడి చేసినందుకు నారాయణమూర్తి, అతడి బంధువులపైనా మరో కేసు నమోదు చేశారు.
  Published by:Nagesh Paina
  First published: