లైంగికవాంఛ తీర్చలేదని అనుచరుడి భార్యను జ్యోతిష్యుడు ఏంచేశాడంటే...?

అప్పుడే జ్యోతిష్యుడి దుర్బుద్ధి బయటపడింది. బాధిత మహిళతో తన పశువాంఛ తీర్చితే కుటుంబం వృద్ధి చెందుతుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అందుకు మహిళ ఒప్పుకోలేదు. బలవంతం చేయాలని చూశాడు.

news18-telugu
Updated: June 19, 2019, 10:00 PM IST
లైంగికవాంఛ తీర్చలేదని అనుచరుడి భార్యను జ్యోతిష్యుడు ఏంచేశాడంటే...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 19, 2019, 10:00 PM IST
మూఢనమ్మకాల మాయలోపడి కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త..వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లో అలీగఢ్ జిల్లాలో సంత్ దుర్గాదాస్ అనే జ్యోతిష్యుడి మాటల్లో పడిన మాన్‌పాల్ అతడు ఏది చెబితే అది వినేవాడు. అంతేకాదు అతడి కోసం ఏదైనా చేసేందుకు మాన్‌పాల్ సిద్ధమయ్యాడు. ఏ పని చేయాలన్నా సరే మాన్‌పాల్ ముందుగా జ్యోతిష్యుడి సలహా తీసుకున్న తర్వాతనే ఏ పనైనా చేసేవాడు. అయితే ఇదే క్రమంలో మాన్‌పాల్ భార్యపై కన్నేశాడు మాయగాడు. ఒక రోజు జ్యోతిష్యుడు మాన్ పాల్‌తో అతని భార్యతో ప్రత్యేక పూజలు చేయించాలని అన్నాడు. అందుకు అతడు ఒప్పుకున్నాడు. మాన్‌పాల్ తన భార్యను జ్యోతిష్యుడి వద్దకు పంపించాడు. అప్పుడే జ్యోతిష్యుడి దుర్బుద్ధి బయటపడింది. బాధిత మహిళతో తన పశువాంఛ తీర్చితే కుటుంబం వృద్ధి చెందుతుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అందుకు మహిళ ఒప్పుకోలేదు. బలవంతం చేయాలని చూశాడు. అయినప్పటికీ మహిళ ప్రతిఘటించింది. చేసేదేమి లేక బాధిత మహిళను వదిలేశాడు. అయినప్పటికీ ఆ మహిళపై పగ పెంచుకున్నాడు.

మాన్‌పాల్ తో కలిసి గంగా నదీ సమీపానికి భార్యను తీసుకురావాలని అక్కడ ప్రత్యేక పూజలు చేసి బలిఇస్తే తిరుగులేని అదృష్టం కలుగుతుందని నమ్మించాడు. దీనికి మాన్‌పాల్ కూడా ఒప్పుకున్నాడు. అయితే భార్యను గంగానదిలోకి తీసుకెళ్లిన తర్వాత జ్యోతిష్యుడు, అలాగే భర్త మాన్ పాల్ ఇద్దరు కలిసి ఆమెను నదిలో బలవంతంగా ఊపిరి ఆడకుండా చేశారు. దీంతో మహిళ ప్రాణాలు విడిచింది. అయితే నది ఒడ్డుపై ఉన్న బాధిత మహిళ కుమారుడు స్థానికులను పిలిచి జరిగింద చెప్పగా, జ్యోతిష్యుడితో పాటు భర్త మాన్‌పాల్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...