అమ్మాయి పుట్టిందని అమ్మను వదిలేసి.. కొడుకు కోసం మరో మహిళతో కులుకుతున్న భర్త

ప్రతీకాత్మక చిత్రం

పున్నామ నరకం నుంచి విముక్తి ప్రసాదించేది కొడుకేగానీ కూతురు కాదంటూ పురాణాలను పునరుద్ఘాటిస్తున్నారు పలువురు భార్యా భర్తలు. అమ్మాయి పుట్టినందుకు భార్యలను వదిలేస్తున్నారు కొందరు భర్తలు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది.

 • News18
 • Last Updated :
 • Share this:
  సృష్టికి మూలం అవని... అలాంటి ఆడపిల్లను వద్దని కొడుకులే కావాలి అని భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి రోడ్ల మీదికి వస్తున్నాయి సంసారాలు. ఆడపిల్లలు పుట్టినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నా.. వారి రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా పలువురు మాత్రం మారడం లేదు. తమకు కూతురు వద్దని.. కుమారుడే కావాలని అనుకుంటున్నారు. పున్నామ నరకం నుంచి విముక్తి ప్రసాదించేది కొడుకేగానీ కూతురు కాదంటూ పురాణాలను పునరుద్ఘాటిస్తున్నారు కొందరు భార్యా భర్తలు. అమ్మాయి పుట్టినందుకు భార్యలను వదిలేస్తున్నారు పలువురు ప్రబుద్ధులు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది.

  మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో చోటు చేసుకుందీ ఘటన. తుఫ్రాన్ కు చెందిన సురేశ్ కు తొమ్మిదేళ్ల క్రితం నాగమణితో వివాహం అయింది. అయితే ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. కానీ సురేశ్ కు మాత్రం తనకు కావాలనే ఆశతో ఉన్నాడు. ఇటీవలే గర్భం దాల్చిన నాగమణి.. మూడో సారి కూడా కూతుర్నే కన్నది. దీంతో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని ఇంట్లో నుండి వెళ్లిపోయి మరో మహిళ తో సహజీవనం సాగిస్తున్నాడు సురేష్.

  మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టగానే సంతోషం తో ఉన్న సురేష్.. తర్వాత తనకు కొడుకు కావాలని ఎదురుచూశాడు. కానీ తర్వాతి కాన్పులో కూడా నాగమణి కూతురుకే జన్మనిచ్చింది. అయితే.. అప్పట్నుంచే వీరిరువురి మధ్య విబేధాలు పొడచూపాయి. నాగమణిని సూటి పోటి మాటలతో ఎత్తి పొడవడం.. వేధించడం వంటివి అయ్యాయి. ఇదిలాఉండగా.. మూడో కాన్పులో కూడా నాగమణి ఆడబిడ్డకే జన్మనిచ్చింది. దీంతో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో సురేశ్.. ఇక తనతో కాపురం చేయలేనని నిశ్చయించుకున్నాడు. తనకు కొడుకు కావాలని.. మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు.

  కొడుకు కావాలని వేధించడమే గాక.. భార్యను, పిల్లలను తరచూ వేధిస్తున్న సురేశ్ పై ఏమిచేయాలో తెలియక నాగమణి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు బాధను అర్థం చేసుకున్న పోలీసులు... నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లలను కాపాడటానికి బేటి బచావో.. బేటి పడావో లాంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపడితే.. ఈ ప్రబుద్ధులు మాత్రం తమకు ఆడబిడ్డ వద్దని ఏకంగా కట్టుకున్న భార్యలనే క్షోభకు గురి చేస్తుండం సిగ్గు చేటు.
  Published by:Srinivas Munigala
  First published: