Home /News /crime /

Telangana : భార్యపై అనుమానం..భర్త మాస్టర్ స్కెచ్..లారీతో చంపి ప్రమాదంగా చిత్రీకరణ..చివరికి

Telangana : భార్యపై అనుమానం..భర్త మాస్టర్ స్కెచ్..లారీతో చంపి ప్రమాదంగా చిత్రీకరణ..చివరికి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Telangana : మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పరిధిలోని బండర్ పల్లి లో గత నెల 25న లారీ ఢీకొని మృతి చెందిన మాలతి (23) హత్యగా పోలీసులు నిర్ధారించారు.

    మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పరిధిలోని బండర్ పల్లి లో గత నెల 25న లారీ ఢీకొని మృతి చెందిన మాలతి (23) హత్యగా పోలీసులు నిర్ధారించారు. కట్టుకున్న భర్త మరో ముగ్గురితో కలిసి పథకం ప్రకారం హత్య చేసి ప్రమాదం చిత్రీకరించేందుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మాలతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేపట్టిన తర్వాత ఇది రోడ్డు ప్రమాదం కాదు హత్యగా తేల్చి నిందితులను అదుపులో తీసుకున్నారు. భూత్పూర్ సీఐ రజిత రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న చింతకుంట మండలం బండర్ పల్లి కి చెందిన రవి కారు డ్రైవర్ గా 2017 లో మాలతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. హైదరాబాద్ కు చెందిన సమీప బంధువులు అయినా ఆంజనేయులు, రమేష్ లతో కలిసి మాలతి హత్యకు పథకం రచించాడు. మరో స్నేహితుడు నల్లగొండ జిల్లా మండలంలోని రూప్ లా తాండ కు చెందిన కేతావత్ వినోద్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని సహాయం తీసుకున్నాడు రవి.

    లారీతో మాలతిని చంపితే వచ్చే బీమా సొమ్ము 15 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గత నెల 25 వ తేదీన మాలతి వ్యవసాయ పనులను ముగించుకొని క దేవరకద్ర మరికల్ రహదారిపై ఇంటికి వెళ్తుండగా ఆమెను లారీ తో ఢీ కొట్టారు. తీవ్రంగా గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానితులను విచారించగా హత్య కోణం వెలుగులోకి వచ్చినట్లు సీఐ రజిత రెడ్డి తెలిపారు.

    హత్య కేసులో ప్రధాన నిందితుడైన మాలతి భర్త రవి, లారీ డ్రైవర్ వినోద్ ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ వివరించారు. మిగతా ఇద్దరు ఇద్దరు నిందితులను పరారీలో ఉన్నారు. గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. త్వరలోనే ఆ నిందుతుల్ని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Crime, Crime news, Husband kill wife, Murder

    తదుపరి వార్తలు