news18-telugu
Updated: November 6, 2020, 10:35 AM IST
ప్రతీకాత్మక చిత్రం
రంగారెడ్డి జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మేడిగడ్డ తండాకు చెందిన లలితను, ఫరూఖ్ నగర్ మండలం గుండెతండాకు చెందిన జటావత్ రమేష్ పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 30న రమేష్, లలితల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన రమేష్.. బార్యపై కత్తితో దాడి చేశాడు.
విచక్షణరహితంగా లలితను 12 చోట్ల తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు వెంటనే లలితను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం లతిత మృతిచెందింది. దీంతో కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ ఘటనపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమేష్ తన భార్యను ఎందుకు చంపాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 6, 2020, 10:35 AM IST