Home /News /crime /

HUSBAND KILLS WIFE WITH HAMMER THAN KILLS HIMSELF OVER FAMILY DISPUTES IN THANE MS

అత్తమామలతో వద్దు.. బయటికెళ్లి బతుకుదామన్న భార్య.. సుత్తెతో కొట్టి చంపిన భర్త.. ఆపై తానూ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో అత్తాకోడళ్లు, భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు కాపురాల విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే థాణెలో వెలుగుచూసింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ భార్య హత్యకు, భర్త ఆత్మహత్యకు కారణమైంది.

  • News18
  • Last Updated :
    కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల వైరస్ నశించిందో లేదో గానీ.. గృహ హింస కేసులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఇటీవల విడుదలవుతున్న పలు నివేదికలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. నగరాల్లో ఉండేవాళ్లు సొంతూళ్లకు వెళ్లడంతో ఇంట్లో అత్తాకోడళ్లు, భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలు కాపురాల విచ్ఛిన్నానికి కారణమవుతున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే థాణెలో వెలుగుచూసింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవ భార్య హత్యకు, భర్త ఆత్మహత్యకు కారణమైంది.

    మహారాష్ట్రలోని థాణెలో వెలుగుచూసిందీ ఘటన. వివరాల్లోకెళ్తే... థాణెలోని ఇందిరానగర్ కు చెందిన ఆకాశ్ (29), అశ్విని (19) కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఆకాశ్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులతోనే ఉంటూ బతుకుబండి ఈడుస్తున్నాడు. ఇందిరానగర్ లోని ఒక ఫ్లాట్ లో తల్లిదండ్రులతో పాటే ఆ నవ దంపతులు కూడా జీవిస్తున్నారు. కాగా.. గతేడాది కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వారి పాలిట శాపమైంది. అత్తాకోడళ్లు తరుచూ గొడవలే. దీంతో అశ్విని తాను ఆ ఇంట్లో ఉండనంటే ఉండనని పట్టుబట్టింది. అక్కడే ఉంటే తాను ఉండనని.. తన పుట్టింటికి వెళ్లిపోతానని వాపోయింది. కొన్ని రోజులు ఆకాశ్ ఆమెను సముదాయించాడు. కానీ ఎంత చెప్పినా ఆమె వినలేదు.

    అత్తాకోడళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో అశ్శిని ఇక తాను సహించలేనని తెగేసి చెప్పింది. ఈనెల 17 న ఇంట్లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాను వెళ్లిపోతానని అశ్విని ఆకాశ్ తో వాగ్వాదానికి దిగింది. బయటకు వెళ్తే తనకు వచ్చే కొద్దిపాటి సంపాదనతో బతకలేమని.. తాను ఆ సాహసం చేయలేనని ఆకాశ్ చెప్పాడు. దీంతో అశ్విని ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ఆకాశ్ తో గొడవకు దిగింది. అదే సమయంలో ఆకాశ్ కూడా అసహనానికి గురయ్యాడు.

    ఎంతచెప్పినా తన భార్య మాట వినడం లేదని పక్కనే ఉన్న సుత్తెతో అశ్విని తలపై గట్టిగా మోదాడు. అంతే కొద్ది క్షణాల్లో అతడి కళ్లను అతడే నమ్మలేకపోయాడు. ఒళ్లంతా రక్తం కారుతుండగా అశ్విని విగతజీవిలా కింద పడిపోయింది. ఇది చూసిన ఆకాశ్... ఆవేదనతో మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భార్య ను చంపిన ఆకాశ్ కూడా చనిపోవడంతో దానిని మూసివేశారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Crime, Crime news, Husband kill wife, Maharashtra, Murder, Thane S13p25

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు