Warangal District: అఫైర్ పెట్టుకుందన్న డౌట్‌తో భార్య హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే మరో నిజం వెలుగులోకి..!

నిందితుడు కిరణ్‌ను మీడియాకు చూపుతున్న పోలీసులు

కిరణ్ 2013లో పద్మ అనే మహిళను ప్రేమించాడు. ఆమె కూడా కిరణ్‌ను ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో కొన్నాళ్లకు కలతలు ఏర్పడ్డాయి. తన భార్య పద్మ వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని కిరణ్ అనుమానపడ్డాడు. ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవపడ్డాడు.

 • Share this:
  వరంగల్: వరంగల్ జిల్లాలో ఓ సైకో భర్త ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. అయితే.. అప్పటికే ఆ మృగాడి పైశాచికత్వానికి ఇద్దరు మహిళలు బలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు గ్రామానికి చెందిన కిరణ్ అల్లరిచిల్లరిగా ఉంటూ బాధ్యత లేకుండా తిరుగుతుండేవాడు. కొడుకును ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పినా కిరణ్ పట్టించుకోకపోవడంతో అతని తల్లిదండ్రులు అతనిని వదిలేసి మహబూబాబాద్‌కు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. అప్పటి నుంచి ఒక్కడే ఉంటున్న కిరణ్ 2013లో పద్మ అనే మహిళను ప్రేమించాడు. ఆమె కూడా కిరణ్‌ను ఇష్టపడటంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో కొన్నాళ్లకు కలతలు ఏర్పడ్డాయి. తన భార్య పద్మ వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని కిరణ్ అనుమానపడ్డాడు. ఈ విషయంలో భార్యతో పలుమార్లు గొడవపడ్డాడు. తాను ఎవరితో ఎఫైర్ పెట్టుకోలేదని ఆమె ఎంత చెప్పినా అతనెవరో చెప్పాలని భార్యను తిట్టికొట్టి వేధించసాగాడు. ఒకరోజు భార్యాభర్తల మధ్య ఇదే విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. క్షణికావేశంలో పద్మను కిరణ్ హత్య చేశాడు. అనంతరం.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు. ఆ తర్వాత భయంతో ఊరొదిలి పారిపోయాడు. ఇదిలా ఉండగా.. 2019లో కిరణ్ కమలాపూర్ మండలం ఉప్పల్‌కు చెందిన అంజలి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి వరకూ తీసుకెళ్లిన కిరణ్ ఆమెతో కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. అంజలిని పెళ్లి చేసుకున్న కిరణ్ ఆమె ఇంట్లోనే మూడు నెలల పాటు ఉన్నాడు.

  అయితే.. భార్య ఏఎన్‌ఎం కావడంతో ఆమె పనిచేసే దగ్గర ఎవరితోనో ఎఫైర్ నడుపుతుందని కిరణ్ అనుమానపడ్డాడు. తను అత్తగారింట్లో ఉండకూడదని భావించి.. భార్యతో సహా ఏనుగల్లుకు వెళ్లి అక్కడ కాపురం పెట్టాడు. అయితే.. జులాయిగా తిరుగుతున్న కిరణ్ అదనపు కట్నం కోసం అంజలిని వేధించసాగాడు. అత్తమామల పేర ఉన్న ఇంటిని అమ్మి డబ్బు తీసుకురావాలని భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు.. కిరణ్‌లో మరో సైకో కోణం కూడా ఉంది. భార్యను టార్చర్ చేస్తున్న సమయంలో ఫోన్‌లో వీడియోలు తీసి ఆ వీడియోలను తరువాత చూసి పైశాచిక ఆనందం పొందేవాడు.

  ఇది కూడా చదవండి: అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వ్యవహారంలో యువకుడికి ఊహించని షాక్.. ఇంతలోనే ఎంతపనయింది..!

  మే 12న రాత్రి సమయంలో కిరణ్ అంజలితో అదనపు కట్నం విషయంలో గొడవపడ్డాడు. ఆమె అఫైర్ నడుపుతోందని భావించి నిలదీశాడు. అంజలి తాను ఏ తప్పు చేయలేదని చెప్పినా వినకుండా ఆమెపై కర్రతో దాడి చేశాడు. కిరణ్ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన అంజలిని ఇరుగుపొరుగు వారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 14న చనిపోయింది. అంజలి హత్య కేసులో కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొదటి భార్యను కూడా హత్య చేసినట్లు బయటపడింది. ఇద్దరు భార్యలను హత్య చేసిన కేసులో కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: