హోమ్ /వార్తలు /క్రైమ్ /

మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని... భార్యను అత్యంత కిరాతకంగా..

మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని... భార్యను అత్యంత కిరాతకంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భర్తతో గొడవ పడి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. అక్కడకు వెళ్లిన భర్త పదునైన పెద్ద కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. పలుమార్లు పొడిచి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు.

  • News18
  • Last Updated :

మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో ఒక వ్యక్తి సొంత భార్యను కడతేర్చాడు. ఆ సంబంధం కారణంగానే కొద్దికాలంగా వారిద్దరి మధ్య సఖ్యత కరువైందని.. దాంతో వాళ్లిద్దరూ తరుచూ గొడవ పడుతుండేవారని తెలుస్తున్నది. ఈ దారుణ ఘటన పంజాబ్ లో గురువారం వెలుగు చూసింది. మృతురాలు.. తన బంధువుల ఇంటికి వెళ్లగా.. అక్కడకు వెళ్లిన ఆమె భర్త పదునైన పెద్ద కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. పలుమార్లు పొడిచి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు. ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది. పంజాబ్ లోని గోరయ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

గోరయ కు చెందిన జశ్వంత్ సింగ్, కుల్విందర్ సింగ్ భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలాకాలం అయింది. నలభై ఏళ్ల కుల్విందర్ సింగ్.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని జశ్వంత్ సింగ్ పదే పదే గొడవ పడేవాడు. ఇదే విషయం మీద వారిద్దరికీ చాలా సార్లు గొడవలయ్యాయి. ఈ క్రమంలోనే కుల్విందర్.. జశ్వంత్ తో గొడవ పడి తన బంధువుల ఇంటికి చేరింది. అయితే అక్కడకు చేరిన జశ్వంత్.. ఆమెతో గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగింది. దీంతో సహనం కోల్పోయిన జశ్వంత్.. వెంట తెచ్చుకున్న పదునైన కత్తిని తీసుకుని ఆమె కడుపులో పలుమార్లు పొడిచి హత్య చేశాడు.

అనంతరం తానే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

First published:

Tags: Crime, Crime news, Husband kill wife, Murder, Punjab

ఉత్తమ కథలు