టిక్‌టాక్ మోజులో భార్య.. అనుమానంతో హత్య చేసిన భర్త..

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టిక్‌టాక్ చేసిన పనికి పచ్చని సంసారం ముక్కలైంది. భార్యపై అనుమానం పెంచేలా చేసి హతమార్చేలా ఉసిగొల్పింది.

news18-telugu
Updated: November 7, 2019, 11:54 AM IST
టిక్‌టాక్ మోజులో భార్య.. అనుమానంతో హత్య చేసిన భర్త..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. టిక్‌టాక్ చేసిన పనికి పచ్చని సంసారం ముక్కలైంది. భార్యపై అనుమానం పెంచేలా చేసి హతమార్చేలా ఉసిగొల్పింది. అసలేం జరిగిందంటే.. కనిగిరికి చెందిన ఫాతిమా, ఫాచూ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఫాతిమా వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానించిన భర్త.. ఆమెను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌లో డ్యాన్సులు చేసిన వీడియోలు పోస్ట్ చేసింది. వాటిని చూసి.. మరోసారి ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయవద్దని భర్త వారించాడు. అయినా, అతడి మాటను పెడచెవిన పెట్టింది ఫాతిమా. టిక్‌టాక్ వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంది. దీంతో అతడు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. ఓ వైపు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం.. మరోవైపు, తన మాట వినడం లేదన్న కోపం.. ఈ రెండు అతడిలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అంతే.. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను హత్య చేశాడు.

ఆ తర్వాత ఫ్యానుకు చీరతో ఉరి వేసి.. ఫాతిమానే ఆత్మహత్యకు పాల్పడిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే.. పోలీసులు శవాన్ని పోస్టుమార్టంకు తరలించగా అసలు నిజం బయటపడింది. దీంతో నిందితుడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా.. టిక్‌టాక్ ప్రభావంతో ఎన్నో కాపురాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని, దాని మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

First published: November 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు