పెళ్లిలో డాన్స్ చేసిందని భార్యను చంపేశాడు..పశువుల పాకలోని తీసుకెళ్లి..

భార్య అలా చేయడం రంజిత్ మాంఝీకి నచ్చలేదు. కోపంతో ఊగిపయిన అతడు.. బంధువులందరి ముందే భార్యను చితకబాదాడు. అనంతరం ఓ పశువుల పాకలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు.

news18-telugu
Updated: May 15, 2019, 9:38 PM IST
పెళ్లిలో డాన్స్ చేసిందని భార్యను చంపేశాడు..పశువుల పాకలోని తీసుకెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 15, 2019, 9:38 PM IST
బంధువుల పెళ్లి వేడుకలో అందరూ డాన్స్ చేస్తున్నారు. డీజే హోరు, తీన్‌మార్ దరువుకు స్టెప్పులేస్తూ అతిథులంతా సంబరాలు చేసుకుంటున్నారు. అందరిలానే ఆ మహిళ కూడా బరాత్‌లో ఆడిపాడింది. ఆ డాన్సే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్లిలో అందరి ముందు డాన్స్ చేసిందన్న కోపంతో భార్య గొంతునులిమి చంపేశాడు భర్త. అందరూ చూస్తుండగానే కిరాతకంగా హతమార్చాడు. బీహార్‌లోని పట్నాలో ఈ దారుణం జరిగింది.

పట్నా జిల్లా హసది ముషారి ప్రాంతంలో పెళ్లివేడుక జరిగింది. ఈ వివాహానికి ఖోరంగ్‌పూర్‌ గ్రామానికి చెందిన రంజిత్‌ మాంఝీ, ఆయన భార్య మునియా దేవి హాజరయ్యారు. దంపతుల తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా వెళ్లారు. పెళ్లి తర్వాత జరిగిన వెడ్డింగ్ పార్టీలో బంధువులంతా డీజే హోరులో స్టెప్పులేశారు. దాంతో అతిథులతో కలిసి మునియా దేవి కూడా డ్యాన్స్ చేసింది. భార్య అలా చేయడం రంజిత్ మాంఝీకి నచ్చలేదు. కోపంతో ఊగిపయిన అతడు.. బంధువులందరి ముందే భార్యను చితకబాదాడు. అనంతరం ఓ పశువుల పాకలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు.

ఊపిరిడాకుండా చేయడంతో మునియా దేవి అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం రంజిత్ మాంఝీ ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...