హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : ఫుల్ గా మందుకొట్టి ఇంటికొచ్చిన సాఫ్ట్ వేర్..భార్యతో ఆ విషయమై గొడవ..అనంతరం దారుణం

Shocking : ఫుల్ గా మందుకొట్టి ఇంటికొచ్చిన సాఫ్ట్ వేర్..భార్యతో ఆ విషయమై గొడవ..అనంతరం దారుణం

భార్యను దారుణంగా చంపిన భర్త

భార్యను దారుణంగా చంపిన భర్త

Husband kills wife: దారుణం జరిగింది. ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ తన భార్యను దారుణంగా కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను..ఇదేంటని ప్రశ్నించిన పాపానికే దారుణంగా భార్యను కొట్టి చంపాడు ఆ భర్త. పూణే(Pune)లో జూన్ 9 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...

Husband kills wife: దారుణం జరిగింది. ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ తన భార్యను దారుణంగా కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తను..ఇదేంటని ప్రశ్నించిన పాపానికే దారుణంగా భార్యను కొట్టి చంపాడు ఆ భర్త(Husband kill wife). పూణే(Pune)లో జూన్ 9 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..పూణేలోని మన్ గావ్ హింజేవాడి ప్రాంతంలో నివసించే అవంతిక శర్మ (30), భర్త శివం పంకజ్ పచౌరి అలియాస్ భరద్వాజ్ (32) భార్యాభర్తలు. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజీనీర్లే. అయితే రోజూ శివం ఇంటికి మద్యం తాగి వచ్చేవాడు. మద్యం అలవాటు మానుకోమని భార్య అవతింక..పలుమార్లు భర్తకు చెప్పింది. అయితే భార్య మాటలను పంజ్ చౌదరి పట్టించుకునేవాడు కాదు. ఆమె ఎంతచెప్పినా వినకుండా రోజూ ఇంటికి తాగొచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల 9న కూడా ఫుల్ గా మందుకొట్టి ఇంటికి వచ్చాడు. దీంతో కోపోద్రిక్తురాలైన భార్య అవంతిక..ఎన్నిసార్లు చెప్పాను,మీరు ఈ అలవాటు మానుకోరా అని భర్తను నిలదీసింది.

ఇదే సమయంలో తాగుడు విషయమై భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో కోపోద్రిక్తుడైన పంకజ్ చౌదరి..భార్య అవంతికపై శారీరక దాడికి పాల్పడ్డాడు. భార్యను దారుణంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన బాధితురాలి తండ్రి రంజన్ కుమార్ లదిమోహన్ శర్మ(61)ఫిర్యాదు మేరకు..హింజేవాడి పోలీసులు పంకజ్ చౌదరిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 302(Murder)కింద పంకజ్ చౌదరిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

Shocking : పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనిష్క్ సేల్స్ గర్ల్ పై దారుణం!

మరోవైపు, మధ్యప్రదేశ్ లో (Madhya pradesh) అమానుష ఘటన చోటుచేసుకుంది. జబల్ పూర్ లో శుక్రవారం దారుణం జరిగింది. విభోర్ సాహు అనే వ్యక్తి, రీతు అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అయితే, విభోర్ సాహు పనిపాట లేకుండా ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. అతడిని పలుమార్లు పని చూసుకోవాలని భార్య చెప్పింది. అతను ఇంట్లోనే ఉండేవాడు. ప్రతి దానికి ఇంట్లో వారిమీదనే డిపెండ్ అయ్యేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచుగా (Family disputes) గొడవలు జరిగేవి. శుక్రవారం రోజు ఇంట్లో అత్త, మరిది ఇంటి నుంచి బైటకు వెళ్లారు. దీంతో ఇద్దరు గొడవ పడ్డారు.

బండారం ముందే బయటపడింది..మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు చేసిన పనికి అందరూ షాక్!

ఎందుకు పని చూసుకొవట్లేదని, ఎలా పోషిస్తారంటూ, భర్తను నోటికొచ్చినట్లు తిట్టింది. దీంతో అతను కోపంలో రెచ్చిపోయాడు. విచక్షణ కోల్పోయి.. కత్తెర తీసుకుని భార్యపై దాడిచేశాడు. ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఆతర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేటికి బయటకు వెళ్లిన అత్త, మరిది ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరు విగత జీవులుగా కన్పించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో భార్య భర్తలు తరచుగా ఉద్యోగం విషయంలో గొడవలు పడేవారని తెలిసింది. దీంతో కోపంలో దారుణానికి ఒడిగట్టి, తనను తాను సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Crime news, Husband kill wife, Pune

ఉత్తమ కథలు