భార్యను చంపిన భర్త... రాత్రంతా శవంతోనే నిద్ర

భార్యను చంపిన భర్త... రాత్రంతా శవంతోనే నిద్ర

ప్రతీకాత్మక చిత్రం

Telangana : భార్యాభర్తలు అన్నాక మనస్పర్థలు కామన్. సర్దుకుపోతూ ఉండాలి. కానీ ఆ కుటుంబంలో అలజడి ఎందుకు రేగింది. భర్తే, భార్యను ఎందుకు చంపాడు? ఆ రాత్రి ఏం జరిగింది?

 • Share this:
  Telangana : వరంగల్ రూరల్ జిల్లా... కుషాయిగూడ పోలీసుల దగ్గరకు వచ్చిన సోమేశ్వర్... తన భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. తాను బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఆత్మహత్య చేసుకుందని వివరించాడు. ఎందుకు? అని పోలీసులు అడిగితే... అతను ఏదేదో నోటికొచ్చినట్లు చెప్పాడు. అతను అలా తడబడుతూ చెబుతుంటే పోలీసులకు డౌట్ వచ్చింది? నిజం చెప్పు అంటూ గద్దించారు. అప్పుడు తెలిసింది అసలు విషయం. సోమేశ్వరే ఆమెను చంపేసి... డ్రామాలాడినట్లు తెలిసింది. రాయపర్తి మండలం రేగుళ్ల తండాకు చెందిన సోమేశ్వర్‌... కొన్నేళ్ల కిందట వరంగల్ వచ్చి పెద్ద చర్లపల్లిలోని రామాలయం వెనుక వీధిలో అద్దెకు దిగాడు. చర్లపల్లిలోని ఓ కంపెనీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శారద(36). వాళ్లకు ఇద్దరు పిల్లలు. శారద మరో కంపెనీలో పనిచేస్తోంది. పిల్లల్ని గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. ఇదంతా చూస్తే... వీళ్ల సంసారం సాఫీగా సాగుతుందని అనిపించడం సహజం. కానీ... సోమేశ్వరే అందులో అలజడి రేపాడు.

  తాగుడు అలవాటున్న సోమేశ్వర్ రోజూ తాగి రావడం... డబ్బంతా తాగుడుకే తగలేస్తుండటంతో... కాపురంలో కలతలు మొదలయ్యాయి. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి కంపెనీ నుంచీ భార్యతో మద్యం మత్తులో సోమేశ్వర్‌ గొడవపడ్డాడు. ఇంత రాత్రి ఎందుకైందే? లేటెందుకైంది? అంటూ ఆమెను అనుమానించాడు. ఆమె తట్టుకోలేకపోయింది. నీచుడా... తాగొచ్చి... నన్నే అనుమానిస్తావా అంటూ రివర్సైంది. అంతే... ఆమెను చితకబాది బాత్రూంలోకి తోసేశాడు. తలకు బలమైన దెబ్బ తగిలి... బ్లడ్ కారి... శారద అక్కడే చనిపోయింది. రాత్రి నుంచీ మర్నాడు సాయంత్రం వరకూ డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచిన సోమేశ్వర్... గురువారం సాయంత్రం పోలీసుల్ని కలిసి... నాటకమాడాడు. డెడ్‌ బాడీని పరిశీలించిన పోలీసులకు విషయం అర్థమైంది. సోమేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

   

  Pics : చందనపు బొమ్మ సంజన క్యూట్ ఫొటోస్
  ఇవి కూడా చదవండి :

  ఆర్టీసీ బస్సు బోల్తా... 25 మందికి గాయాలు

  నేడు తేలనున్న మహారాష్ట్ర పంచాయతీ... సాయంత్రంలోపు కీలక ప్రకటన

  IND vs BAN | నేడే పింక్ బాల్ టెస్ట్... ఇవీ ప్రత్యేకతలు

  Health : నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.


  Health Tips : పియర్స్ తినండి... బరువు తగ్గండి... ఎన్నో ప్రయోజనాలు

  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు