అనంతపురంలో దారుణం.. పుట్టింట్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

ఇటీవల లలిత అనారోగ్యానికి గురయింది. అంతేకాదు పెళ్లై 9 నెలలు గడిచినా.. ఆమె గర్భం దాల్చడం లేదని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి.

news18-telugu
Updated: February 21, 2020, 2:36 PM IST
అనంతపురంలో దారుణం.. పుట్టింట్లో భార్యను చంపి భర్త ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యకు పిల్లలు కలగడం లేదనే కారణంతో కట్టుకున్న భార్యను చంపేశాడు భర్త. ఆమె పుట్టింట్లోనే బండరాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం చెట్టుకు ఉరేసుకొని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం తారకాపురంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని కణెకల్లు మండలం బిదురుకొంతం గ్రామానికి చెందిన సురేష్ (25), బొమ్మనహాళ్ మండలం తారకాపురానిక చెందిన లలిత (21) వివాహం తొమ్మిది నెలల క్రితం జరిగింది. కొన్నాళ్లు పాటు వీరి కాపురం సజావుగానే సాగింది.

ఐతే ఇటీవల లలిత అనారోగ్యానికి గురయింది. అంతేకాదు పెళ్లై 9 నెలలు గడిచినా.. ఆమె గర్భం దాల్చడం లేదని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. కల్లుదేవనహళ్లిలోని వన్నూరుస్వామి పీర్ల చావిడిలో మొక్కులు చెల్లిస్తే సంతానం కలుగుతుందని బంధువుల ద్వారా తెలుసుకున్నారు. ఆ ఊరు లలిత పుట్టింటికి దగ్గర్లోనే ఉటుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం భార్యాభర్తలు తారకాపురానికి వెళ్లారు. అక్కడి నుంచి వన్నూరుస్వామి పీర్ల చావిడికి వెళ్లేందుక ప్లాన్ చేసుకున్నారు. ఐతే ఉన్నట్టుండి సురేష్‌కు ఏమైదో ఏమో.. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యతో గొడవపడ్డాడు. కోపంతో ఊగిపోయి లలిత తలపై బండరాయితో మోదడంతో ఆమె చనిపోయింది.

లలిత చనిపోయిన తర్వాత సురేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరి శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. భార్యాభర్తల మృతిలో ఇరువురి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్నాళ్లుగా లలితపై సురేష్ అనుమానం పెంచుకున్నాడని.. ఆ క్రమంలోనే హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాలను పరిశీలించి ఆధారాలను సేకరించారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు