ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...

మదర్ థెరిసా, నాగేశ్వరావు దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో తరచూ వారి మధ్య గొడవలు వస్తుండేవి.

news18-telugu
Updated: December 6, 2019, 4:01 PM IST
ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...
మదర్ థెరిసా, నాగేశ్వరావు దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో తరచూ వారి మధ్య గొడవలు వస్తుండేవి.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. మూడోనెల గర్భిణి అయిన తన భార్యను భర్త అత్యంత దారుణంగా హత్యచేశాడు. ఉరివేసి చంపాడు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక గ్రామానికి చెందిన మదర్ థెరిసా (22), ఆమె భర్త నాగేశ్వరరావు (28)కి మూడేళ్ల క్రితం పెళ్లయింది. పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాటి నుంచి భీమవరంలో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. మదర్ థెరిసా, నాగేశ్వరావు దంపతులు కులాంతర వివాహం చేసుకోవడంతో తరచూ వారి మధ్య గొడవలు వస్తుండేవి. ఈ నేపథ్యంలో మదర్ థెరిసాను భర్త నాగేశ్వరరావు ఉరివేసి చంపాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading