Husband: అందమైన భార్య.. హ్యాపీగా కాపురం చేసుకోక ఇదేం పని.. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు..

రూప, కాంత్‌రాజ్ (ఫైల్ ఫొటో)

అందమైన యువతిని భార్యగా చేసుకున్నాడు. కానీ.. అనుమానం అనే పురుగు అతని మెదడును తొలిచేసింది. తన భార్య ఎవరితోనో అఫైర్ నడుపుతుందని డిసైడ్ అయిపోయి ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో మాదిరిగా చంపేసి ఆ హత్య కేసు నుంచి తప్పించుకోవాలనుకున్నాడు.

  • Share this:
    బెంగళూరు: అందమైన యువతిని భార్యగా చేసుకున్నాడు. కానీ.. అనుమానం అనే పురుగు అతని మెదడును తొలిచేసింది. తన భార్య ఎవరితోనో అఫైర్ నడుపుతుందని డిసైడ్ అయిపోయి ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో మాదిరిగా చంపేసి ఆ హత్య కేసు నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. అందుకు రెండు సినిమాలను చూసి ప్రేరణ పొందాడు. కానీ.. ఆ రెండు సినిమాల్లో తాను చూసిన సీన్స్ రియల్ లైఫ్‌లో వర్కవుట్ కాకపోవడంతో నట్టింట్లో కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌లో వెలుగుచూసింది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంత్‌రాజు అనే వ్యక్తి బెంగుళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని భార్య పేరు రూప. కొన్నేళ్ల క్రితం వీరిద్దరి వివాహమైంది. రూప పేరుకు తగ్గట్టుగానే రూపవతి. చూడటానికి అందంగా ఉంటుంది. అయితే.. ఆమె భర్త మనసు మాత్రం అందవిహీనంగా మారింది. ఫైనాన్స్ వ్యాపారం చేసే కాంత్‌రాజు రోజులో ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపేవాడు. అందంగా ఉన్న తన భార్య ఎవరితోనైనా వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానంతో మనశ్శాంతిని దూరం చేసుకున్నాడు. ఆమె ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడినా అనుమానపడేవాడు. ఆ అనుమానం ఇటీవల మరింత ముదిరింది.

    పరిస్థితి తన చేయి దాటిపోయిందని కాంత్‌రాజ్ భావించాడు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఫిక్స్ అయిపోయాడు. అయితే.. ఆ విషయంలో ఆమెతో గొడవపడలేదు. తాను అనుమానిస్తున్నట్లు భార్యకు అనుమానం కలగకుండా ప్రవర్తించాడు. కానీ.. లోలోపల ఆమెపై పగ పెంచుకుని రగిలిపోయాడు. భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఆమెను హత్య చేసినా నేరం తనపైకి రాకుండా ఉండేందుకు ఏం చేయొచ్చో కొన్ని సినిమాలు చూశాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన రెండు సినిమాల్లోని సీన్లను చూశాడు. తన భార్యతో కలిసి టూర్‌కు వెళ్లినట్లు వెళ్లి ఓ కొండపై నుంచి లోయలోకి తోసేసి ప్రమాదవశాత్తూ ఆమె చనిపోయినట్లుగా చిత్రీకరించాలనుకుని ఓ సినిమాలోని సీన్‌ను చూసి ప్రేరణ పొందాడు. కానీ.. ఆ ప్లాన్ ఫలించలేదు.

    ఇది కూడా చదవండి: Shocking: యాక్సిడెంట్ అయి పదిరోజులుగా ఇంట్లోనే ఉన్న భర్త.. భార్యను అలా చూసి తొందరపడి ఎంతపని చేశాడంటే..


    మరో సినిమా చూసి.. రెండు కార్లు ఢీ కొని.. ఒక కారులో ఉన్న భార్య చనిపోయేలా ప్లాన్ చేశాడు. ఆ ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలని భావించిన కాంత్‌రాజ్ దారుణానికి ఒడిగట్టాడు. అదృష్టవశాత్తూ రెండు సందర్భాల్లో చావు నుంచి తప్పించుకున్న రూప ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఇంట్లో ఉన్న భార్యను కాంత్‌రాజ్ కత్తితో పొడిచి.. ఆ తర్వాత డోర్ లాక్ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో తన భార్యపై అప్పటికే కాంత్‌రాజ్ సినిమాటిక్ స్టైల్లో హత్యా ప్రయత్నం చేసి విఫలమైనట్లు తెలిసింది. సెప్టెంబర్ 22న కాంత్‌రాజ్ వంటగదిలో ఉన్న భార్యపై కిచెన్‌లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించడంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది.
    Published by:Sambasiva Reddy
    First published: