• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • HUSBAND KILLED WIFE WITH THE HELP OF FATHER OVER DOUBT ON ILLEGAL AFFAIR IN PRAKASAM DISTRICT HSN

ఇంట్లోనే ఒంటరిగా భార్య.. పొలం నుంచి వస్తుండగా ఓ వ్యక్తి ఇంట్లోంచి పారిపోవడాన్ని చూసిన భర్త.. చివరకు..

ఇంట్లోనే ఒంటరిగా భార్య.. పొలం నుంచి వస్తుండగా ఓ వ్యక్తి ఇంట్లోంచి పారిపోవడాన్ని చూసిన భర్త.. చివరకు..

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

అతడు పొలం పనికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి కాస్త దూరంగా ఉండగానే ఓ వ్యక్తి తన ఇంట్లోంచి బయటకు వచ్చి పారిపోవడాన్ని గమనించాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య ఒక్కతే ఒంటరిగా ఉంది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

  • Share this:
    అతడు పొలం పనికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి కాస్త దూరంగా ఉండగానే ఓ వ్యక్తి తన ఇంట్లోంచి బయటకు వచ్చి పారిపోవడాన్ని గమనించాడు. అతడు ఎవరు? అన్నది ఏమీ గుర్తించలేదు. ఆ సమయంలో ఇంట్లో భార్య ఒక్కతే ఒంటరిగా ఉంది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న అతడు కాస్తా భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా తన తండ్రి సాయంతో ఆమెను హతమార్చాడు. ఆ హత్యకేసు నుంచి తప్పించుకునేందుకు పశువుల పాకలో చీరతో ఆమె ఉరి వేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. కానీ పోలీసుల ఎంట్రీతో అతడిలో భయం పెరిగిపోయింది. ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని పోలీసులు ప్రాథమికంగా తేల్చడంతో తాను దొరికిపోవడం ఖాయం అనుకున్నాడు. ఆ భయంతోనే పోలీసులకు లొంగిపోయాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు గ్రామానికి చెందిన కొండవీటి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన 22 ఏళ్ల శైలజకు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి మూడేళ్ల వయసున్న కొడుకు కూడ ఉన్నాడు. నెల రోజుల క్రితం శ్రీనివాసులు పొలం నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఓ గుర్తు తెలయని వ్యక్తి ఇంట్లోంచి బయటకు పారిపోతున్నట్టుగా కనిపించింది. ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో భార్య ఒక్కతే ఇంట్లో ఉంది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను నిలదీస్తే అలాంటిదేమీ లేదని చెప్పి వాపోయింది. అయినా శ్రీనివాసులు ఆమెను వేధించడం మానలేదు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తుండటంతో ఈ నెల 16న ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ కూడా జరిగింది. కుటుంబ పెద్దలు సర్దుబాటు చేశారు.
    ఇది కూడా చదవండి: ఇంట్లోంచి భార్య మాయం.. ప్రియుడితో వెళ్లిందని తెలిసి వెతుక్కుంటూ వెళ్లిన భర్త.. చివరకు కథ అడ్డం తిరిగింది..!

    అయినప్పటికీ తీరు మార్చుకోని శ్రీనివాసులు ఫిబ్రవరి 20న అర్ధరాత్రి నిద్రపోతున్న శైలజ మెడపై కాలితో తొక్కి హతమార్చాడు. మూడు నెలల గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పశువుల పాకలోకి తీసుకెళ్లి చీరతో ఉరి వేసుకుని చనిపోయినట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. దీని కోసం తన తండ్రి సాయం కూడా తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చి ప్రాథమిక విచారణ చేశారు. మృతదేహంపై గాయలు ఉన్నట్టు గుర్తించారు. హత్యేనని ప్రాథమిక నిర్థారణకు వచ్చి ఆ దిశగా విచారణ ప్రారంభించారు. అయితే నేరం బయటపడుతుందని భావించిన శ్రీనివాసులు పోలీసులకు లొంగిపోయాడు. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. తన తండ్రి సాయం తీసుకున్నానని కూడా చెప్పాడు. దీంతో వారిద్దరినీ బుధవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు.
    ఇది కూడా చదవండి: 2.3 కిలోల బంగారం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. చొక్కా జేబే పట్టించింది.. ఒకే ఒక్క మిస్టేక్ చేసి అడ్డంగా బుక్కయిన 108 సిబ్బంది
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు