రాత్రి పూట భార్యకు బలవంతంగా కూల్ డ్రింక్ తాగించిన భర్త.. తెల్లారేసరికి ఇంట్లో ఆమె శవంగా.. అసలు కథేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం / నిందితుడు రాజ్ కుమార్

రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి ప్రియాంక అనే యువతితో కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబంతో కలిసి మెన్నవేడు గ్రామంలోనే జీవిస్తున్నాడు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది.

 • Share this:
  దంపతుల మధ్య మూడో వ్యక్తి రాక వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఆగమయిపోతున్నాయి. ప్రేయసి మోజులో పడి భార్యను భర్త హతమార్చడమో, లేక భార్యే ప్రియుడి మోజులో పడి భర్తను చంపేయడమో చేస్తున్న సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దిశ, నిర్భయ వంటి చట్టాలు చేసినా స్త్రీలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఘోరాలకు అడ్డుకట్ట పడటం లేదు. మృగాళ్ల ఆగడాలకు అడ్డేలేకుండా పోతోంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. భర్త చేతుల్లో ఓ భార్య ప్రాణాలు కోల్పోయింది. అనుమానం అనే పిశాచం ఆ భర్తను వెంటాడింది. చివరకు కనికరం లేకుండా ఆ భార్యను భర్తే కడతేర్చాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తమిళనాడు రాష్ట్రంలోని తిరువలంగాడు సమీపంలో మెన్నవేడు గ్రామంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి ప్రియాంక అనే యువతితో కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబంతో కలిసి మెన్నవేడు గ్రామంలోనే జీవిస్తున్నాడు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది. కుటుంబంతో కలిసి హ్యాపీగా అంతా కలిసి ఉండేవాళ్లు. అయితే వారి మధ్యలోకి ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. అతడి రాకతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. కార్తీక్ అనే 27 ఏళ్ల యువకుడితో ప్రియాంకకు పరిచయం అయింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి బంధం గురించి ఊళ్లో స్థానికులకు తెలిసింది. ఇది కాస్తా రాజ్ కుమార్ కు తెలిసింది.
  ఇది కూడా చదవండి: ప్లీజ్.. నన్ను రెండో పెళ్లయినా చేసుకోమని కోరిన యువతి.. నో చెప్పిన ప్రియుడు.. ఆ భగ్న ప్రేమికురాలు ఎంతకు తెగించిందంటే..

  ఇది నిజమేనని గ్రహించిన రాజ్ కుమార్, తన భార్యను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోమని హితవు పలికాడు. అయినప్పటికీ భార్య తన తీరు మార్చుకోలేదు. దీంతో రాజ్ కుమార్ లో ఆగ్రహం పెరిగింది. శుక్రవారం ఇంటికి వచ్చిన రాజ్ కుమార్, తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపాడు. భార్య ప్రియాంక చేతులను తాళ్లతో కట్టేశాడు. ఆ తర్వాత ఆమె నోట్లో పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ను పోశాడు. దీంతో ఆమె మరణించింది. ఈ విషయం తెలిసి ప్రియాంక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేసి, భర్తే ఈ హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు. అతడు కూడా నిజం ఒప్పుకోవడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
  ఇది కూడా చదవండి: భర్తతో తెగదెంపులు.. పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్న 25 ఏళ్ల యువతికి ఓ వ్యక్తి పెళ్లి ప్రపోజల్.. చివరకు..
  Published by:Hasaan Kandula
  First published: