Extramarital Affair: భర్త మరో మహిళతో బిజీ... కళ్లారా చూసిన భార్య... ఆ తర్వాత

భర్త మరో మహిళతో బిజీ... కళ్లారా చూసిన భార్య... ఆ తర్వాత (ప్రతీకాత్మక చిత్రం - credit - youtube)

Extramarital Affair: వివాహేతర సంబంధాలు నానాటికీ పెరుగుతున్నాయి. వాటి వల్ల అనేక ఇతర సమస్యలు వస్తున్నాయి. మరి ఈ కేసులో ఏమైంది? వివాహేతర సంబంధం వల్ల ఏం జరిగింది?

  • Share this:
    నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన సురేష్... స్థానిక మున్సిపల్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. అతనికి కొన్నాళ్ల కిందట సుభాషిణితో పెళ్లైంది. వీరికి ఒక పాప ఉంది. అంతా బాగానే ఉంటే... వీళ్ల కుటుంబం చల్లగా ఉండేది. కానీ... ఓ ప్రళయం వచ్చి పడింది. సురేష్... శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యకు తెలియకుండా ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంటి దగ్గర భార్యతో మాత్రం ఏమీ లేనట్లుగా నటిస్తున్నాడు. ఈమధ్య బంధువులు చనిపోవడంతో ఆ మహిళ సూళ్లూరు పేట వచ్చింది. సురేష్‌ని కలిసింది. ఆ తర్వాత ఇద్దరూ ఏకాంతంలో ఉండగా... భార్య సుభాషిణి చూసింది. ఒక్కసారిగా షాకైంది. ఆమెతో ఉన్నది తన భర్తేనా అని నమ్మలేకపోయింది. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది ఆమెకు.

    ఏంటిది... ఏం జరుగుతోందిక్కడ... ఎవరామె... అంటూ వరుస ప్రశ్నలు వేసింది సుభాషిణి. ఆమెను సైలెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించాడు. కానీ సుభాషిణి ఫుల్లుగా ఫైరైంది. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాంతో ఇద్దరూ కలిసి సుభాషిణిపై దాడి చేశారు. ఇంటికి లాక్కొచ్చి బలవంతంగా ఆమె నోట్లో పురుగుల మందు పోశారు. దాంతో... సుభాషిణి గట్టిగా అరుస్తుండటంతో... పక్కింటి వారు పరుగున వచ్చారు. విషయం గ్రహించి... వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ అమె చనిపోయింది.

    ఈ వివాదంపై పెద్దలు పంచాయితీ పెట్టి రాజీ చేశారు. సురేష్ పేరిట ఉన్న భూమి కూతురి పేరున రాయించారు. అతనికి నెల నెలా వచ్చే జీతంలో సగం పాపకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. సురేష్ మాట నిలబెట్టుకోలేదు. ఎదురు తిరిగాడు. దాంతో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు రాసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగి కావడంతో కొందరు నేతలతో తప్పించుకునే యత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    ఇది కూడా చదవండి:Husband kills wife: టైముకి భోజనం పెట్టలేదని భార్యను చంపిన భర్త...

    వేరే మహిళ మోజులో కట్టుకున్న భార్యను చంపిన సురేష్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సుభాషిణి తల్లిదండ్రులు కోరుతున్నారు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకెళ్లడంతో కూతురు ఒంటరైంది. సుభాషిణి తల్లిదండ్రులే ఆ పాప ఆలనా పాలన చూస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: