Home /News /crime /

ప్రేమ పెళ్లి.. అర్ధరాత్రి గాఢనిద్రలో భార్య.. ఇంట్లోంచి పరారయ్యే ముందు ఆ భర్త చేసిన ఘోరమిది..!

ప్రేమ పెళ్లి.. అర్ధరాత్రి గాఢనిద్రలో భార్య.. ఇంట్లోంచి పరారయ్యే ముందు ఆ భర్త చేసిన ఘోరమిది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యపైనే అనుమానం వ్యక్తం చేశాడు. తనతో 17 ఏళ్ల పాటు కాపురం చేసిన భార్యను కూడా అనుమానంతో వేధించాడు. చిత్ర హింసల పాలు చేశాడు. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో భార్య గాఢనిద్రలో ఉండటాన్ని గమనించాడు. ఆ తర్వాత..

ఇంకా చదవండి ...
    అనుమానం అనే పెనుభూతం మగాళ్లను వదలడం లేదు. రోజూ ఏదో ఒక చోట అనుమానంతో భార్యలను భర్తలు కడతేర్చుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏళ్ల తరబడి సంసారం చేసిన భార్యలను కూడా భర్తలు అనుమానిస్తూనే ఉన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఘోరాలకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి తన భార్యపైనే అనుమానం వ్యక్తం చేశాడు. తనతో 17 ఏళ్ల పాటు కాపురం చేసిన భార్యను కూడా అనుమానంతో వేధించాడు. చిత్ర హింసల పాలు చేశాడు. చివరకు నిద్రపోతుండగానే కడతేర్చాడు. గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం మున్నంవారి పాలేనికి చెందిన పలిమినేని సత్యనారాయణరెడ్డి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన దివ్య అనే మహిళను 17 ఏళ్ల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సజావుగా జరుగుతున్న వారి కాపురంలో భర్తకు వచ్చిన అనుమానం అనే పెనుభూతం చిచ్చుపెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అతడు అనుమానపడుతూ వచ్చాడు. ఇదే విషయమై వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎవరితోనో అక్రమసంబంధం నెరపుతున్నావంటూ గొడవపడుతున్నాడు. కుల పెద్దలు వారి మధ్య సయోధ్య కుదిర్చినా కొన్నాళ్లపాటు బాగానే ఉన్నారు. మళ్లీ వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

    ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి ఇంట్లోనే భార్య నిద్రపోతోంది. భార్య గాఢ నిద్రలో ఉండటాన్ని గమనించిన భర్త రోకలిబండతో ఆమె తలపగలగొట్టాడు. తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా పట్టించుకోకుండానే తర్వాత ఇంట్లోంచి పరారయ్యాడు. ఆమె అరుపులు కేకలు విన్న పక్కింటి వాళ్లు వచ్చి చూశారు. ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా బుధవారమే పూర్తయ్యాయి. ఈ ఘటనపై భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడి కోసం గాలిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Husband kill wife, Wife kill husband

    తదుపరి వార్తలు