Home /News /crime /

HUSBAND KILLED WIFE OVER DOUBT IN GUNTUR DISTRICT BA GNT

భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. గుంటూరు జిల్లాలో దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. రాత్రివేళ గొంతునులిమి అమానుషంగా అంతమొందించాడు.

  గుంటూరులో జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. రాత్రివేళ గొంతునులిమి అమానుషంగా అంతమొందించాడు. సత్తెనపల్లి మండలం కట్టావారిపాలెంలో జరిగిన ఈ దారుణ ఘటన జరిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన గాయత్రి(20)ని కట్టావారిపాలేనికి చెందిన ఫిలిప్‌కిచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నాటి నుంచి ఫిలిప్ భార్యను అనుమానిస్తూ తరచూ గొడవడేవాడు. అదే చివరికి ఆమె పాలిట శాపంగా మారింది. భార్యపై అనుమానంతో ఫిలిప్ ఘాతుకానికి తెగబడ్డాడు. ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరగడంతో కోపంతో ఊగిపోయిన భర్త అమానుషంగా భార్య గొంతునులిమి చంపేశాడు. అనంతరం తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భార్య మృతదేహాన్ని పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి సువార్తమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఫిలిప్, అత్త తిరుపతమ్మపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  కోడికూర వండలేదని భార్యను చంపిన భర్త
  రోజులు మారుతున్న కొద్దీ మనుషులు మృగాల కంటే అధ్వాన్నంగా తయారవుతున్నారు. నేర ప్రవృత్తి విచ్చలవిడిగా పెరిగిపోతున్నది. చిన్నపాటి గొడవలకు, మనస్పర్థలకు కూడా సొంతవారిని చంపుకునే స్థితికి వెళ్తున్నారు. దసరా పండుగ రోజు ఇంట్లో కోడి కూర వండలేదని ఏకంగా భార్యనే హతమార్చాడో భర్త. చెడు వ్యసనాలకు అలవాటు పడి.. దానికి బానిసగా మారిన ఒక భర్త.. పండుగ పూట ఇంట్లో కోడి కూర ఎందుకు వండలేదని ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా పండుగ పూట తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్ల లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో దసరా నాడు ఈ ఘటన జరిగింది.

  రాయవరం గ్రామానికి చెందిన సన్నయ్య అనే వ్యక్తి దినసరి కూలిగా పనిచేస్తున్నాడు. అతను తాగుడుకు బానిసయ్యాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో పండుగ నాడు ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కోడికూర వండలేదని కోపంతో ఊగిపోయాడు. దీంతో భార్య సీతమ్మను అర్జెంటుగా కోడి కూర వండాలని బలవంతపెట్టాడు. కానీ ఆమె వండలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సన్నయ్య.. సీతమ్మను తీవ్రంగా కొట్టాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆమె చనిపోయింది. సీతమ్మను చంపిన సన్నయ్య.. ఆమె మృతదేహాన్ని ఇంట్లో దాచి ఎవరికీ చెప్పకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఒక్కరోజు తర్వాత లోపల ఉన్న శవం నుంచి వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి ఆ తలుపులు తెరవడంతో అసలు విషయం బయట పడింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ మొదలు పెట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Guntur

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు