Illegal Affair: వేరే వ్యక్తితో మాట్లాడుతుందని.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

ప్రతీకాత్మక చిత్రం

Illegal Affair: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతోందన్న కారణంతో ఆమెపై అనుమానం పెంచుకున్న భర్త దారుణంగా హత్య చేశాడు.

  • Share this:
    నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానం ఆ కాపురాన్ని కాటేసింది. 20 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య చిన్నగా మొదలైన పంచాయితీ.. చివరకు భార్య హత్యకు దారి తీసింది. దీంతో ఇద్దరు పిల్లలు తల్లిలేనివారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మడమనూరుకి చెందిన చెడిమాల శీనయ్య 20 ఏళ్ల కిందట మొదటి భార్యను విడిచిపెట్టి చెంచమ్మతో సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నాడు. చెంచమ్మ తొలుత వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు అడపిల్లలు. కొన్నేళ్ల తర్వాత భర్తను విడిచిపెట్టి చెంచమ్మ పిల్లలతో కలిసి శీనయ్య వద్ద ఉంటోంది. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో చెంచమ్మ తరచూ మరో వ్యక్తితో  మాట్లాడుతుండడానాన్ని శీనయ్య గమనించాడు. ఆమె అతడితో వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు అనుమానం పెంచుకున్నాడు.

    ఈ క్రమంలో ఇద్దరి మధ్య 20 రోజుల కిందట ఘర్షణ జరిగింది. దీంతో చెంచమ్మ అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శీనయ్య, చెంచమ్మ బంధువులతో తన భార్య ఇంటికి రావాలని, లేకుంటే చనిపోతానని చెబుతూ బెదిరించేవాడు. దీంతో చెంచమ్మ బంధువులు ఆమె ఆచూకీ తెలుసుకుని సోమవారం గ్రామానికి పిలిపించారు. అనంతరం గ్రామంలోని ఓ పెద్దమనిషి వద్ద పంచాయితీ పెట్టారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరించి కాపురం చేసుకునేలా సర్దుబాటు చేసి పంపించారు. కానీ కలిసి ఉంటానని చెప్పిన కొద్ది నిమిషల్లోనే శీనయ్య, చెంచమ్మతో మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో కత్తితో ఆమె తలపై మోది, గొంతు కోశాడు.

    దీంతో చెంచమ్మ అక్కడికక్కడే కన్నుమూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, రూరల్‌ సీఐ ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ సూర్యప్రకాష్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలు, వివరాలను వారు బంధువులను అడిగి తెలుసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, మృతదేహంపై ఉన్న కత్తి గాట్లను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సూర్యప్ర కాష్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న శీనయ్య స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.
    Published by:Nikhil Kumar S
    First published: