Husband killed wife : దేశంలోని అనేక ప్రాంతాల్లో మాదిరిగానే బీహార్‌లో కూడా ప్రస్తుతం చలి తీవ్రంగా ఉంది. అటువంటి పరిస్థితిలో చలికోటు లేదా జాకెట్లకు డిమాండ్ కూడా వేగంగా పెరిగింది. అయితే జాకెట్ డిమాండ్‌ను తీర్చలేదని ఓ భర్త తన భార్యను హతమార్చిన ఘటన బీహార్(Bihar) రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైశాలి జిల్లా దేశరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పానాపూర్ రఘునాథ్ గ్రామానికి చెందిన కాళీ చరణ్ సింగ్ అలియాస్ బుల్బుల్ సింగ్ కి ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మగైడిహ్ గ్రామానికి చెందిన రితిక అనే యువతితో 8 నెలల క్రితం వివాహం జరిగింది. హిందూ ఆచారాల ప్రకారం మే 2, 2022న కాళీ చరణ్ సింగ్-రితిక పెళ్లి అయింది. జనవరి 2, 2023 ఉదయం 7:30 గంటలకు కాళీ చరణ్ సింగ్ హఠాత్తుగా అత్తమామలు ఫోన్ చేసి మీ కూతురు ఆరోగ్యం క్షీణించిందని,త్వరగా రండి అని చెప్పారు. రితిక కుటుంబ సభ్యులు వెంటనే బయల్దేరి వెళ్లారు. అయితే వారు వెళ్లేసరికి రితిక విగతజీవిగా పడి ఉంది. అల్లుడు, అతని తల్లిదండ్రులు కలిసి తమ కుమార్తెను గొంతుకోసి చంపారని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు. దీనికి సంబంధించిన రుజువు వైద్యబృందం అధికారులు అక్కడికక్కడే చెప్పాల్సి ఉందని.. గొంతుపై మరక స్పష్టంగా కనిపిస్తున్నందున పోలీసులు కూడా హత్యగా పరిగణించారని మృతురాలి తల్లి తెలిపారు.పెళ్లయినప్పటి నుంచి రితికను కట్నం కోసం డిమాండ్ చేస్తూ అత్తింటివారు వేధిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
Success Story : ఒకప్పుడు భారత్ లో బీడీలు చుట్టేవాడు..ఇప్పుడు అమెరికాలో జడ్జి అయ్యాడు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Crime news, Husband kill wife