HUSBAND KILLED WIFE DUE TO DOUBT ON ILLEGAL AFFAIR IN DELHI HOUSE OWNER COMPLAINT TO POLICE FULL DETAILS HERE HSN
అద్దెకుంటున్న భార్యాభర్తలు.. తలుపులు తీసే ఉండటంతో మాట్లాడేందుకు వెళ్తే కనిపించిన దృశ్యం చూసి ఆ యజమానికి..
ప్రతీకాత్మక చిత్రం
ఆ ఇంటి తలుపులు తెరచే ఉన్నాయి. ఒకటికి రెండు సార్లు బయట ఉండే పిలిచాడు. కానీ ఎంతకూ ఎవరూ స్పందించలేదు. లోపలికి వెళ్లాడు. ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి వణికిపోయాడు. అసలేం జరిగిందంటే..
ఇంటి యజమాని. తన ఇంట్లో అద్దెకు ఉండే భార్యాభర్తలతో మాట్లాడేందుకు వెళ్లాడు. అయితే ఆ ఇంటి తలుపులు తెరచే ఉన్నాయి. ఒకటికి రెండు సార్లు బయట ఉండే పిలిచాడు. కానీ ఎంతకూ ఎవరూ స్పందించలేదు. లోపలికి వెళ్లాడు. ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి వణికిపోయాడు. వంటగదిలో రక్తపు మడుగులో మహిళ పడి ఉంది. భర్తే ఆమెను చంపి పరారై ఉంటాడని అతడికి అర్థం అయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని భలస్వా డైరీ ప్రాంతంలో 26 ఏళ్ల నందన్, తన భార్య 25 ఏళ్ల పూజతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. స్థానికంగా కర్రీ పాయింట్ ను నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. ఇద్దరి మధ్య తరచుగా గొడవ జరుగుతోంది.
భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని భర్తకు అనుమానం వచ్చింది. ఈ విషయమై కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య తీవ్ర వాదులాట జరుగుతోంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం నందన్ తన భార్య పూజతో గొడవపడ్డాడు. ఆగ్రహంలో ఆమెను సుత్తితో చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారణ అయ్యాక మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటి యజమాని వారితో మాట్లాడేందుకు వెళ్లాడు.
అయితే తలుపులు తీసే ఉండటం, ఇంట్లోంచి ఎవరూ స్పందించకపోవడంతో లోపలకు వెళ్లాడు. వంట గదిలో తీవ్ర రక్తపు మడుగులో ఆమె పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. భర్త నందన్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.