హోమ్ /వార్తలు /క్రైమ్ /

పుట్టింట్లో ఉంటున్న భార్య వద్దకు వెళ్లి, ఇద్దరు పిల్లల కళ్ల ముందే ఆ భర్త ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..

పుట్టింట్లో ఉంటున్న భార్య వద్దకు వెళ్లి, ఇద్దరు పిల్లల కళ్ల ముందే ఆ భర్త ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దలాయ్ జిల్లాలోని హపనియా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల నారాయణ్ దాస్ కు 15ఏళ్ల క్రితమే పెళ్లయింది. అయితే కుటుంబ కలహాల భార్య జయాదాస్ తన తల్లిగారి ఊరైన అంబస్సాలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. సోమవారం భార్య వద్దకు వచ్చిన నారాయణ్ దాస్, భార్య, అత్త కాజోలీ దాస్ తో గొడవ పడ్డాడు.

ఇంకా చదవండి ...

గుంపులు గుంపులుగా జనాలు. అతడి చుట్టూ పోలీసులు. ఎక్కడికక్కడ పోలీసులను అడ్డుకుంటూ అతడి కోసం జనాల పోరాటం. ఆ వ్యక్తిని వారి నుంచి తప్పించి, ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చిన పోలీసులు. ఏంటీ ఇదంతా చదువుతోంటే ఏదో ఒక సెలబ్రెటీని అభిమానులు చుట్టుముడితే, వారి నుంచి ఆ సెలబ్రెటీని పోలీసులు రక్షించినట్టుగా అర్థం అవుతోందా.? అయితే మీరు పొరపాటు పడినట్టే. ఇక్కడ ఆ జనాలు ఆ వ్యక్తి ఆటోగ్రాఫ్ కోసమో, ఫొటో కోసమో ఎగబడటం లేదు. అతడిని అక్కడికక్కడే చంపేయాలనీ, తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఊపిరి ఆడకుండా చేశారు. ఇంతకీ అతడు చేసిన తప్పేంటనే కదా మీ డౌటు. 15 ఏళ్ల పాటు తనతో కాపురం చేసిన భార్యను, ఆమె తల్లిని, తన ఇద్దరు పిల్లల ఎదుటే అతి కిరాతకంగా చంపేశాడు. త్రిపుర రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దలాయ్ జిల్లాలోని హపనియా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల నారాయణ్ దాస్ కు 15ఏళ్ల క్రితమే పెళ్లయింది. అయితే కుటుంబ కలహాల భార్య జయాదాస్ తన తల్లిగారి ఊరైన అంబస్సాలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. సోమవారం భార్య వద్దకు వచ్చిన నారాయణ్ దాస్, భార్య, అత్త కాజోలీ దాస్ తో గొడవ పడ్డాడు. ఆ గొడవ కాస్తా సీరియస్ గా మారడంతో నారాయణ్ దాస్ లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఇంట్లో ఉన్న కత్తితో పొడిచి భార్యను చంపేశాడు. అడ్డు వచ్చిన అత్త కాజోలీ దాస్ ను కూడా అదే కత్తితో పొడిచి చంపేశాడు. ఆ సమయంలో ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. వారి అరుపులకు భయపడిన స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి చూస్తే దారుణ మైన దృశ్యం కనిపించింది.

దీంతో పెద్ద సంఖ్యలో స్థానికులు గుమిగూడి నారాయణ్ దాస్ ను పట్టుకుని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలయడంతో వారు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నారాయణ్ ను అక్కడి నుంచి స్టేషన్ కు తరలించడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. స్థానికులంతా చుట్టుముట్టి అతడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ’ఈ క్రూరుడికి బతికే హక్కు లేదు. ఇక్కడే చంపేస్తాం. మాకు అప్పగించండి. మీరు వెళ్లిపోవచ్చు.‘ అంటూ పోలీసులను స్థానికులు డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు తీవ్ర ప్రయాస పడి అతడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Husband kill wife, Tripura

ఉత్తమ కథలు