Home /News /crime /

Sad: ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు.. కలిసి ఉంటూనే మనసులో ఎంత పగ.. ఇంటర్నెట్‌లో వెతికి మరి..

Sad: ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు.. కలిసి ఉంటూనే మనసులో ఎంత పగ.. ఇంటర్నెట్‌లో వెతికి మరి..

శోభన, కావ్య

శోభన, కావ్య

ఓ మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు అనుమానస్పద స్థితిలో (deaths of woman and her daughter) మృతిచెందారు. వారు గార్బా వేడుకల్లో పాల్గొని ఇంటికి చేరుకున్న అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.

  ఓ మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు అనుమానస్పద స్థితిలో (deaths of woman and her daughter) మృతిచెందారు. వారు గార్బా పండగ‌లో పాల్గొని ఇంటికి చేరుకున్న అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు మహిళను, చిన్నారిని ఆమె భర్తే హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని (Gujarat) వడోదరాలో(Vadodara) చోటుచేసుకుంది. మృతులను శోభన, ఆమె కుమార్తె కావ్యగా గుర్తించారు. పోలీసులు, శోభన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శోభన(36)కు తేజస్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్లు కూతురు కావ్య ఉంది. అయితే తేజస్ తల్లి, సోదరితో శోభన కలిసి ఉండలేకపోయింది. ఈ క్రమంలోనే అతని కుటుంబంతో విడిపోయిన తర్వాత శోభన తల్లి ఇంట్లోనే వారు నివాసం ఉంటున్నారు. అయితే తేజస్ (Tejas) చాలా మట్టుకు చిరాకుగా ఉండేవాడని.. అందుకే దంపతుల మధ్య గొడవలు జరిగేవని శోభన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

  ఈ క్రమంలోనే నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన గర్బా వేడుకల్లో (garba festivities) పాల్గొన్న తర్వాత శోభన, ఆమె కూతరు మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. అయితే కొన్ని గంటల తర్వాత తేజస్.. శోభన సోదరుడితో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని చెప్పాడు. పాప పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. అయితే మరణించిన శోభన మెడపై గాయాలు (Injury found on neck) ఉన్న విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాత చర్యలు తీసుకోవాలని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే పోలీసులు తేజస్, ఇతర కుటుంబ సభ్యులను విచారణ చేపట్టారు. వారి వద్ద నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు.

  Diwali 2021 Car Offers: దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ మోడళ్లపై బెస్ట్ ఆఫర్లను పరిశీలించండి..

  శోభనకు పోస్ట్ మార్టమ్ నిర్వహించిన వైద్యులు.. ఆమె కడుపులో విష పదార్థం ఉన్నట్టుగా గుర్తించారు. అది ఎలుకలను చంపేదుకు వాడేదిగా చెప్పారు. మరోవైపు పోలీసులు ఇందుకు సంబంధించి విచారణను ముమ్మరం చేశారు. అయితే ఇక్కడే పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలిసింది.  తేజస్ ఇటీవల ఇంటర్నెట్‌లో ఎలుకలను చంపే విషయం, విషంతో ఎలా చంపవచ్చు, మనిషిని ఎలా చంపాలి, దిండును ఉపయోగించి ఎలా చంపాలి.. అనే విషయాల గురించి వెతికినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే అతని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు. అక్టోబర్ 10వ తేదీన భార్యను, కూతురిని చంపేందుకు వారి ఆహారంలో ఎలుకల మందు కలిపినట్టుగా చెప్పాడు. అయితే ఆ తర్వాత కూడా బతికి ఉండటంతో.. తన భార్యను చేతులతో గొంతు నులిమి చంపినట్టుగా అంగీకరించాడు. దీంతో అతనిపై రెండు హత్యలకు గానూ సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్ట్ చేశారు.

  Life Expectancy: ఆ గ్రామ మహిళల ఆయుర్దాయం 95 సంవత్సరాలు.. రికార్డు స్థాయి ఆయుష్షుకు కారణం ఏంటంటే..

  ఇక, తేజస్‌కు గతంలో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని శోభన సోదరుడు పోలీసులకు చెప్పాడు. అయితే అతనే మారడానికి మరో అవకాశం ఇచ్చినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ మరణాల వెనక ఉన్న అన్ని కారణాలను కనుగోనడానికి విచారణ జరుపుతున్నట్టుగా చెప్పారు. మరోవైపు తేజస్ గోళ్ల నమునాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Gujarat

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు