మగబిడ్డ కాబట్టే మూడేళ్ల కొడుకును వదిలేశా.. నిద్రపోతుండగానే భార్యాకూతురిని చంపేశా.. నిజం ఒప్పుకున్న భర్త

లత, లాస్య (ఫైల్ ఫొటోలు)

మిస్టరీ వీడింది. అనుమానాస్పదంగా చనిపోయి కనిపించిన తల్లీకూతుళ్లను చంపిందెవరో తేలిపోయింది. ఏడాది వయసున్న పాపను, భార్యను భర్తే చంపేశాడన్న నిజం వెలుగులోకి వచ్చింది. శివరాత్రి రోజున గుడికి వెళ్లి ఇంటికి వచ్చి ఆదమరచి నిద్రపోతున్న భార్యను..

 • Share this:
  మిస్టరీ వీడింది. అనుమానాస్పదంగా చనిపోయి కనిపించిన తల్లీకూతుళ్లను చంపిందెవరో తేలిపోయింది. ఏడాది వయసున్న పాపను, భార్యను భర్తే చంపేశాడన్న నిజం వెలుగులోకి వచ్చింది. శివరాత్రి రోజున గుడికి వెళ్లి ఇంటికి వచ్చి ఆదమరచి నిద్రపోతున్న భార్యను కడతేర్చిన భర్త, ఆ తర్వాత ఏడాది వయసున్న కూతురిని కూడా హతమార్చాడు. శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలం కోవిలాం గ్రామానికి చెందిన లత అనే 21 ఏళ్ల మహిళకు హనుమాన్ నగర్ కు చెందిన రమేష్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. రమేష్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆ ఇద్దరు దంపతులకు రెండేళ్ల తనీష్, ఏడాది వయసున్న లాస్య అనే కూతురు ఉన్నారు.

  గురువారం ఉదయం ఆ భార్యాభర్తలు, వారి ఇద్దరు కూతుళ్లు, రమేష్ సోదరుడు చిరంజీవి, తల్లితో కలిసి శివరాత్రి సందర్భంగా గుడికి వెళ్లి వచ్చారు. మధ్యాహ్నం అందరూ కలిసి ఇంట్లోనే భోజనం చేశారు. ఆ తర్వాత వారంతా నిద్రపోయారు. అయితే రమేష్, చిరంజీవి, వారి తల్లి కలిసి సాయంత్రం సమయంలో బయటకు వెళ్లి వచ్చారు. ఇంటికి వచ్చేసరికే భార్య ఇంకా నిద్రలేవకపోవడంతో ఆమెను లేపేందుకు ప్రయత్నించాడు. అయితే లాస్య, భార్య లత మరణించారని అప్పడే వారు గుర్తించారు. దీంతో ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో కలకలం రేగింది. భార్యాపాపను భర్తే చంపాడని లత తల్లి అంకమ్మ ఆరోపించింది. ఓ మహిళతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందునే ఈ దారుణానికి తెగించాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేషన్ ను పోలీసులు స్టేషన్ కు పిలిపించి తమదైన శైలిలో విచారించారు. దీంతో భర్త అసలు నిజం కక్కాడు.
  ఇది కూడా చదవండి: శివరాత్రి గుడికి వెళ్లొచ్చి అందరూ పడుకున్నారు.. భార్య, ఏడాది వయసున్న కూతురు ఇంకా లేవలేదేంటని గదిలోకి వెళ్లి చూసిన ఆ భర్తకు..

  ‘శివరాత్రి రోజున భార్యాపిల్లలను తీసుకుని గుడికి వెళ్లాను. అక్కడకు నా ప్రియురాలు కూడా వచ్చింది. ఆమెను నా భార్య చూసింది. దీంతో గుడి వద్ద ఇద్దరూ కాస్త గొడవపడ్డారు. ఇదే విషయమై గతంలో కూడా మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అందుకే నా భార్యను చంపాలని నిర్ణయించుకున్నా. గుడిలో దర్శనం పూర్తయ్యాక ఇంటికి వెళ్లాం. అన్నం తిన్న తర్వాత ఆదమరచి నిద్రపోతున్న భార్య ముఖంపై దిండును అదిమి చంపేశా. ఆ తర్వాత ఏడాది వయసున్న కూతురిని కూడా గొంతు నులిమి చంపేశా. మగబిడ్డ కనుక మూడేళ్ల కొడుకు తన్వీష్ ను విడిచపెట్టాను. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాను. కొన్ని గంటల పాటు ఏమీ తెలియకుండానే గడిపాను. ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాను. కానీ కుదరలేదు‘ అంటూ ఆ భర్త అసలు నిజాన్ని ఒప్పేసుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేశారు. కాగా, తల్లీ, చెల్లి కనిపించకపోవడంతో మూడేళ్ల తన్వీష్ దిగాలుగా ఏడుస్తూ ఉండిపోయాడు. అతడిని లత తల్లి తన వెంట తీసుకెళ్లిపోయింది.
  ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు
  Published by:Hasaan Kandula
  First published: