Home /News /crime /

Andhra Pradesh: భార్యపై అనుమానంతో భర్త షాకింగ్ నిర్ణయం.., పాపం ఆ చిన్నారులు...

Andhra Pradesh: భార్యపై అనుమానంతో భర్త షాకింగ్ నిర్ణయం.., పాపం ఆ చిన్నారులు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చిత్తూరు జిల్లాలో (Chittor District) ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడాలని భావించిన ఓ ఇల్లాలిపై అనుమానం పెంచుకున్న భర్త.., ఘాతుకానికి ఒడిగట్టాడు.

    వివాహబంధం అంటే నమ్మకంపైనే నిలబడుతుంది. భార్యభర్తలకు ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం ఉంటేనే ఆ బంధం నిలబడుతుంది. లేదంటే కాపురంలో రోజూ కలహాలే. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడాలని భావించిన ఓ ఇల్లాలిపై అనుమానం పెంచుకున్న భర్త.., ఘాతుకానికి ఒడిగట్టాడు. క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకొని కన్నబిడ్డలను అనాథలను చేశాడు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధికి చెందిన శ్రీనివాసులుకు కేబీపురం మండలం, రాగిగుండకు చెందిన మంజులతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లులున్నారు. శ్రీనివాసులు పట్టణంలోనే ఓ హోటల్లో పనిచేస్తుండగా., మంజుల శ్రీ సిటీలోని ఓ సెల్ ఫోన్ కంపెనీలో పనిచేస్తోంది. మంజుల ఉద్యోగం చేయడం ఇష్టంలేని శ్రీనివాసులు.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

    ఈ నేపథ్యంలో ఉద్యోగం మానేయాల్సిందిగా శ్రీనివాసులు తరచూ మంజులతో గొడవపడుతున్నాడు. ఈక్రమంలో గురువారం కంపెనీ విధులు ముగించుకొని ఇంటికొచ్చిన మంజులను మాట్లాడాలి రమ్మని బెడ్ రూమ్ కు తీసుకెళ్లిన శ్రీనివాసులు..,వెంటనే తలుపు గడివేసుకున్నాడు. ఐతే భార్యాభర్తలిద్దరూ ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసులు తల్లి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.., ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. శ్రీనివాస్ ఉరివేసుకోగా.., మంజుల రక్తపుమడుగులో పడి ఉంది. అనుమానంతో భార్యను హత్య చేసి.., తాను ఉరివేసుకున్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.శ్రీనివాసులు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    శ్రీనివాసులు క్షణికావేశంలో చేసిన తప్పుకు అతడి ఇద్దరు కుమార్తెలు ఒంటరివారయ్యారు. భార్యపై అనుమానం ఇద్దరి ప్రాణాలను బలిగొందని బంధువులు విలపిస్తున్నారు. వారి చిన్నకుమార్తె చిన్నవయసు కావడంతో తల్లిదండ్రులు మృతి చెందిన విషయం కూడా ఆ చిన్నారికి అర్ధం కావడం లేదు. నాన్నా ఎందుకింత పనిచేశావ్ అంటూ పెద్దకుమార్తె విలపిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Chittoor, Crime, Crime news, Extramarital affairs, Husband kill wife, Murder, Suicide

    తదుపరి వార్తలు