Hyderabad crime : పెళ్లైన నెలకే భార్యపై అనుమానం..కట్ చేస్తే... భార్యభర్తలు విగతజీవులయ్యారు... !

హత్యకు గురైన మహిళ..

Hyderabad crime : పెళ్లై నెల రోజులు కాకుండానే భార్యపై అనుమానం పెంచుకున్నాడు.. రెండు పంచాయితీ పెట్టి చివరికి కసాయిగా మారాడు. భార్య గొంతుతో పాటు కాళ్లు చేతులు కట్ చేసి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

 • Share this:
  పెళ్లి (Marriage)చేసుకుని సంసార జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తానని కలలు కన్న ఓ వివాహిత జీవితాన్ని నెల రోజులకే భర్త రూపంలో చిదిమేశాడు. పెళ్లి తర్వాత కనీసం ఒకరినొకరు అర్థం చేసుకునే సమయం కూడా లేకుండా భర్త క్రూరంగా వ్యవహరించారు. బలహీనంగా ఉన్న భార్యపై పడి క్రూరమృగంలా వ్యవహారించాడు.

  హైదారాబాద్ (hyderabad)బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతు కోసి చంపి (murder)తాను ఆత్మహత్య (suicide)చేసుకున్నాడు. నెల రోజుల క్రతమే వీరి వివాహం జరిగింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న భర్త కిరణ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా (kamareddy)గాంధారి మండలానికి చెందిన పుట్టల గంగారాం.. దేవునిపల్లిలో స్థిరపడ్డారు. ఆయన కూతురు సుధారాణిని.. కామారెడ్డికి చెందిన ఎర్రోల కిరణ్ కుమార్‎కు ఇచ్చి ఆగస్టు 27న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ. 14 లక్షల నగదు, ఒక ఫ్లాట్, 10 తులాల బంగారం ఇచ్చారు. వృత్తిరిత్యా సాఫ్ట్‎వేర్ ఇంజినీర్ అయిన కిరణ్.. బాచుపల్లి(Bachupally) ప్రగతి నగర్‎లోని శ్రీ సాయి ద్వారకా అపార్ట్‎మెంట్‎లో నివాసముంటున్నాడు... పెళ్లి తర్వాత కొత్త దంపతులు హైదరాబాద్‎కు వచ్చారు.

   ఇది చదవండి : కూతురిపై తండ్రి లైంగిక దాడి.. ప్రతిఘటించిన కూతురు.. పెద్ద సహసమే చేసింది...!


  అయితే కొద్ది రోజులకే వారిమధ్య అనుమానాలు చెలరేగాయి.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చేటు చేసుకుది. ఈ క్రమంలోనే కొద్ది క్రితమే కిరణ్..తన భార్య సుధారాణిని గొంతు పిసికి హత్యప్రయత్నాం చేశాడు. ఈ ఘర్షణతో సుధారాణి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. అయితే పెళ్లయి నెల కాకపోవడంతో ఇరువురు కుటుంబాల పెద్దలు కిరణ్ కుమార్ ను పిలిచి రాజీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. దాంతో కిరణ్ తల్లిదండ్రులతో కలిసి సుధారాణిని తీసుకొని వారం కిందట మళ్లీ హైదరాబాద్‎కు(hyderabad) చేరుకున్నాడు. వారితో పాటు కిరణ్ తల్లితండ్రులు కూడా కొద్ది రోజులు ఉన్నారు.. ఆ తర్వాత సుధారాణి తల్లిదండ్రులకు కూడా వచ్చి చూడాలని చెప్పారు. ఆ తర్వాత తిరిగి వారు శుక్రవారమే స్వగ్రామం కామారెడ్డికి వెళ్లిపోయారు..

  సుధారాణి అత్తామామల పిలవడంతో సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంటి డోర్ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు. మధ్యాహ్నం కావడంతో పడుకున్నారేమో అనుకొని 3 గంటల వరకు వెయిట్ చేశారు. మళ్లీ వెళ్లి పిలిచినా ఎలాంటీ రెస్పాన్స్ రాలేదు.. ఎంత పిలిచినా తలుపులు తీయలేదు.. ఇలా రాత్రి 9 గంటల వరకు వేచి చూసిన సుధారాణి తల్లిదండ్రులు పోలీసులకు(police) సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి చూడగా.. సుధారాణి బెడ్ మీద విగత జీవిగా పడి ఉంది. ఆమె చేతులు, కాళ్లు, గొంతు కట్ చేసి ఉన్నాయి. పక్కనే కిరణ్ కూడా చేయి, గొంతు కోసుకొని పడి ఉన్నాడు.

  ఇది చదవండి : రెండు రోజుల్లో పెళ్లి, అమ్మాయితో పాటు మధ్యవర్తి ఫోన్ కూడా స్విచాఫ్ అయింది..కారణం ఇదే..


  షాక్ గురైన పోలీసులు సుధారాణి(sudharani) చనిపోయిందని నిర్ధారించారు.. అయితే అపస్మారక స్థితిలో ఉన్న కిరణ్‌ను వెంటనే నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుధారాణిని కిరణ్ కుమార్ చంపాడనే కోపంతో ఆమె బంధువులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో సామాగ్రి, ఫర్నీచర్, కిరణ్ వాహనాన్ని ధ్వంసం చేశారు. సుధారాణి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
  Published by:yveerash yveerash
  First published: