Tragedy : అందగా ఉండడంతో.. అందరు తన భార్యనే చూస్తున్నారని ఓ భర్త ఏం చేశాడంటే...?

ప్రతీకాత్మక చిత్రం

Tragedy : అందంగా ఉండడమే ఆమెకు శాపంగా మారింది. ఆ అందమే భర్త సైకోలా మారేలా చేసింది. తనకు ఉన్న రూపంతో ఎక్కడ దక్కకుండా పోతుందో అని సినిమా స్టైల్లో స్కెచ్ వేశాడు.. ఆమెతో ఇతరులు చనువుగా ఉండడం భరించలేక దారుణానికి పాల్పడ్డాడు..

 • Share this:
  మగాళ్లలో చాలా మంది కాబోయో భార్య చాలా అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అందరికి తాము అనుకున్నట్టుగా సంబంధాలు కుదరవు.. అయితే అయితే అలా భార్య అందంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి అదృష్టం ఫలించింది. తాను ఊహించని అందగత్తె భార్యగా లభించింది. అయితే పెళ్లికి వచ్చిన వారంతా ఆమె అందాన్నే పోగడడం , ఆ తర్వాత కూడా ఇద్దరు భార్యభర్తలు ఎక్కడికి వెళ్లినా.. ఆమెనే చాలా మంది చూడడం భర్తకు నచ్చలేదు.. దీంతో ఆ భర్త దారుణానికి ఒడిగట్టిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

  . వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ( Bengalor) అన్నపూర్ణేశ్వరి నగర్‌లో బీఆర్ కాంతరాజు(40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఫైనాన్స్ వ్యాపారం ( finanace )చేసే ఇతను.. రూప(32) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లిలో ( marriage ) రూపను చూసిన వారంతా.. అపురూప సౌందర్యవతి అని ఆశ్చర్యపోయారు. తన భార్య అందం గురించి పలువురు.. పదే పదే పొగుడుతుంటే ముందు అందరి లాగానే సంబర పడ్డాడు. అయితే రానురాను కాంతరాజుకు ఈర్ష్యతోపాటు అనుమానాలు, అభద్రతాభావం మొదలైంది. ఎక్కడ తన భార్య తనను వదిలి వెళ్లిపోతుందో అనే సంకోచాలు చుట్టుముట్టాయి. తన భార్యను అందాన్ని తాను ఒక్కడినే చూడాలనుకున్నాడు. ఎవరైనా తన భార్యను చూస్తే.. సహించలేకపోయాడు.

  ఇది చదవండి : భర్త దారుణం.. అందరి ముందే.. భార్యపై కత్తితో వేటు


  ఈ క్రమంలో రూప తన పుట్టింటి వారితో కలిసి చిక్‌మంగళూరుకు టూర్‌కు వెళ్లింది. కాంతరాజు కూడా వెంటే వెళ్లాడు. అక్కడ యువకులు మొత్తం తన భార్యనే చూస్తున్నారని అసూయ చెందాడు. ఆఖరికి దగ్గరి బంధువులతో మాట్లాడుతున్నా తట్టుకోలేకపోయాడు. ఆ సమయంలోనే తన బంధువులైన ఇద్దరు యువకులతో రూప డ్యాన్స్ చేసింది. అది చూసి భర్త ఆగ్రహంతో ఊగిపోయాడు. తన భార్యను అంతా చూస్తుండడంతో ఆనుమానాలు మరింత బలపడ్డాయి... ఈ టెన్షన్ భరించలేక తన భార్యను కడతేర్చాలని భావించాడు..

  ఇది చదవండి : మరో చిన్నారీపై అత్యాచారం.. విషయం బయటకు రాకుండా మహిళా నేత రాజీ.


  ఈ క్రమంలో చంపేయాలని ప్లాన్ ( murder plan ) వేశాడు.రోజూ కావాలనే రూపతో గొడవ పెట్టుకునేవాడు. ఆమెకు అందరితో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ టార్చర్ చేశాడు. టూర్‌లో యువకులతో వేసిన డ్యాన్స్‌ను ( Dance ) గుర్తు చేస్తూ గొడవ చేశాడు. తనకు ఏం సంబంధమూ లేదని రూప వారిస్తున్నా వినలేదు. చివరకు పట్టలేని ఆగ్రహంతో స్క్రూడైవర్ తీసుకుని.. ఒక్కసారిగా రూప గొంతులో పొడిచాడు. అంతటితో ఆగకుండా కత్తితో మెడ కోసి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కాంతరాజు కోసం వేట ప్రారంభించారు.
  Published by:yveerash yveerash
  First published: