హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime news : బతుకుమ్మ ఆడుతుండగా భార్యను తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన భర్త .. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు

Crime news : బతుకుమ్మ ఆడుతుండగా భార్యను తలపై ఇనుప రాడ్డుతో కొట్టిన భర్త .. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు

Crime news: గ్రామానికి చెందిన మహిళలంతా బతుకమ్మ పండుగ సంబురాల్లో మునిపోయిన సమయంలో ఊహించని దారుణం జరిగింది. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి స్వప్న అనే వివాహితను ఇనుప రాడ్డుతో తలపై కొట్టాడు.  తీవ్రరక్తస్రావంతో బాధిత మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India

గ్రామానికి చెందిన మహిళలంతా బతుకమ్మ(Bathukamma)పండుగ సంబురాల్లో మునిపోయిన సమయంలో ఊహించని దారుణం జరిగింది. ఇంతలో ఓ వ్యక్తి అక్కడికి వచ్చి స్వప్న(Swapna) అనే వివాహితను ఇనుప రాడ్డుతో తలపై కొట్టాడు. తీవ్రరక్తస్రావంతో బాధిత మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. పండుగ పూట ఊరి జనం మధ్యలో వివాహితను హత్య చేసింది ఆమె భర్తేనని తెలిసి అందరూ షాక్ అయ్యారు. వివాహేతర సంబంధం(Extramarital affair)కారణంగానే ఈవిధంగా కక్ష తీర్చుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజు సిద్దిపేట(Siddipet)జిల్లాలో ఈదారుణం చోటుచేసుకుంది.

Telangana: బతుకమ్మ పండుగలో కోలాట ప్రదర్శనలు .. ఆ గ్రామ మహిళలే అందులో అద్భుత కళాకారులు

పండుగ పూట దారుణం..

సిద్దిపేట జిల్లాలో ఆడపడుచులు బతుకమ్మ సంబురాల్లో ఉండగానే దారుణం జరిగింది. వీరాపూర్‌ గ్రామంలో స్వప్న అనే వివాహిత తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతుండగా ఆమె భర్త ఎల్లారెడ్డి ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. భర్త చేతిలో తీవ్రంగా గాయపడ్డ స్వప్న తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. వీరాపూర్‌ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డితో ఆరేళ్ల క్రితమే స్వప్నకు వివాహం జరిగింది. స్వప్న, ఎల్లారెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్దిరోజుల క్రితం స్వప్న అదే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో గత 14ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

వివాహేతర సంబంధం..

ఈవిషయం భర్తకు తెలియడంతో తీరు మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. స్వప్న భర్త మాట వినిపించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. ఆమెపై కసి తీర్చుకునేందుకు పథకం వేసుకొని ఆదివారం రాత్రి సమయంలో ఊరి జనం మధ్యలో బతుకమ్మ ఆడుతుండగా ఇనుప రాడ్డుతో తలపై బాది చంపాడు. అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడు. మృతురాలు స్వప్న తల్లిదండ్రులు గోపాల్‌రెడ్డి, ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తెను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన నెల రోజులకే కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకుంది పెద్ద కుమార్తె మంగ. ఆ తర్వాత రెండో కుమార్తె స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు.

Telangana : దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేసిన తెలంగాణ హైకోర్టు సీజే .. ఉజ్జల్ భుయాన్ ఏమన్నారంటే

మనస్పర్ధల వల్ల మర్డర్ ..

మొదట్లో సాఫీగానే సాగిన స్వప్న కాపురం..అటుపై వివాహేతర సంబంధం విషయంలో భార్య,భర్తల మధ్య మనస్పర్దలు వచ్చాయి. వాటిని మనసులో పెట్టుకొని ఎల్లారెడ్డి స్వప్నను చంపుతానంటూ పలుమార్లు హెచ్చరించినట్లుగా మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వప్న పేరెంట్స్ కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు ఎల్లారెడ్డి కోసం గాలిస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Bathukamma 2022, Siddipet, Telangana crime news

ఉత్తమ కథలు