హోమ్ /వార్తలు /క్రైమ్ /

Ranga Reddy: ఛాతిలో నొప్పిగా ఉందని.. హాస్పిటల్‌కు వెళ్లి చూపించుకుని వద్దామని భార్య చెప్పింది.. నిజమేననుకుని భర్త నమ్మినందుకు..

Ranga Reddy: ఛాతిలో నొప్పిగా ఉందని.. హాస్పిటల్‌కు వెళ్లి చూపించుకుని వద్దామని భార్య చెప్పింది.. నిజమేననుకుని భర్త నమ్మినందుకు..

పోలీసుల అదుపులో నిందితులు

పోలీసుల అదుపులో నిందితులు

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. పర స్త్రీ, పర పురుషుడిపై వ్యామోహం అనర్థాలకు దారి తీస్తుందని తెలిసినా కొందరి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ప్రియుడి మోజులో పడి భర్త హత్యకు కుట్ర పన్నిన భార్య చివరకు జైలు పాలైంది.

ఇంకా చదవండి ...

రంగారెడ్డి: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. పర స్త్రీ, పర పురుషుడిపై వ్యామోహం అనర్థాలకు దారి తీస్తుందని తెలిసినా కొందరి తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ప్రియుడి మోజులో పడి భర్త హత్యకు కుట్ర పన్నిన భార్య చివరకు జైలు పాలైంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను మట్టుపెట్టిన ఆ భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. షాబాద్ మండలం కేశవగూడ గ్రామానికి చెందిన పామెన మాణిక్యరావుకు, శోభారాణికి పన్నెండేళ్ల క్రితం పెళ్లైంది. ముగ్గురు పిల్లలున్నారు. భర్తతో కొన్నాళ్లు శోభారాణి అన్యోన్యంగానే ఉంది. మాణిక్యరావు కూడా భార్యాపిల్లలను పోషించుకుంటూ ఉన్నంతలో సుఖంగానే చూసుకుంటున్నాడు. కానీ.. ఇటీవల శోభారాణి ప్రవర్తనలో ఊహించని మార్పు వచ్చింది. భర్తతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ మరో మగాడికి దగ్గరైంది. షాబాద్‌కు చెందిన యాదయ్య అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత కొన్ని నెలలుగా శోభారాణి, యాదయ్య మాణిక్య రావు కళ్లుగప్పి శారీరకంగా కలుస్తున్నారు. అయితే.. వీరి వివాహేతర సంబంధానికి శోభారాణి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన వీరిద్దరూ మాణిక్యరావును చంపేయాలని కుట్ర పన్నారు. ఆ ప్లాన్‌లో భాగంగా.. ఆగస్ట్ 13న తనకు ఛాతిలో నొప్పిగా ఉందని.. హాస్పిటల్‌కు వెల్లి చూపించుకుని వద్దామని భర్తతో శోభారాణి చెప్పింది. భార్య చెప్పింది నిజమేనని నమ్మి మాణిక్యరావు శోభారాణిని షాద్‌నగర్ తీసుకెళ్లి హాస్పిటల్‌లో చూపించుకుని తిరిగొస్తున్నాడు. ఆస్పత్రిలో చూపించుకుని ఆటోలో ఇద్దరూ మామిడిపల్లికి వచ్చారు. ఆటో దిగి భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ షాబాద్‌కు వెళుతున్నారు.

శోభారాణి తన ప్లాన్‌లో భాగంగా యాదయ్యకు ఫోన్ చేసి.. మేం షాబాద్ వస్తున్నామని చెప్పింది. అప్పటికే ఆమె కాల్ కోసం వేచిచూస్తున్న యాదయ్య బైక్‌పై వెళ్లాడు. శోభారాణి, మాణిక్య రావు మామిడిపల్లి శివారుకు చేరుకోగానే బైక్‌పై వచ్చిన యాదయ్య శోభారాణి చున్నీతో మాణిక్యరావు మెడకు ఉరి బిగించారు. శోభారాణి, యాదయ్య కలిసి మాణిక్యరావుకు ఊపిరాడకుండా చేసి చంపేశారు. సాయంత్రం కావడంతో ఆ వైపుగా ఎవరూ వెళ్లలేదు. మాణిక్యరావు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత శోభారాణి, యాదయ్య కలిసి అతని శవాన్ని పక్కనే ఉన్న పొదల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు యాదయ్య తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ కారు తీసుకుని మాణిక్యరావు శవాన్ని డిక్కీలో వేసుకుని శ్రీశైలం హైవేలో ఉన్న అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని లోయలో పడేశారు. శవాన్ని మాయం చేశాక.. శోభారాణి తన ప్లాన్‌ను అమలుచేసింది.

ఇది కూడా చదవండి: Daughter In Law: వామ్మో.. ఈ కోడలు మరీ ఇలా ఉందేంటి.. ఈ సంగతి తెలిసి ఇరుగుపొరుగు ఉలిక్కిపడ్డారు..!

మీ అబ్బాయి కనిపించడం లేదని, తనకు భయంగా ఉందని మాణిక్య రావు తండ్రి అనంతయ్యకు చెప్పింది. అనంతయ్య ఆగస్ట్ 24న తన కొడుకు కనిపించడం లేదంటూ షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాణిక్యరావు భార్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. తమ స్టైల్లో ఆమెను విచారించగా.. అసలు నిజం బయటికొచ్చింది. భర్తను చంపిన నిందితురాలు శోభారాణిని, ఆమె ప్రియుడు యాదయ్య, అతని స్నేహితులు శ్రీశైలం, వినోద్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రియుడి మోజులో పడి భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన శోభారాణి చివరికి కటకటాల పాలైంది.

First published:

Tags: Extra marital affair, Husband killed by wife, Married women, Telangana crime, Telangana crime news

ఉత్తమ కథలు