హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపి మహాపతివ్రతలా డ్రామా!

Shocking : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపి మహాపతివ్రతలా డ్రామా!

,ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య,

,ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య,

Extramarital Affair : ప్రియుడితో కులకడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య..ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఫ్లాన్ చేసింది. జ్యోతి,శ్రీకాంత్ ఇద్దరూ..కర్మవీర్ ని హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. భర్తకు ఎప్పటిలాగే భోజనం పెట్టిన జ్యోతి..హత్య పథకంలో భాగంగా ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది.

ఇంకా చదవండి ...

Wife Kills Husbnd With Lover : హర్యానా(Haryana)లో ఘోరం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను కత్తితో గొంతు కోసి హత్య చేసింది ఓ భార్య. . హత్య అనంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో పొలంలో నిర్మించిన ట్యూబ్‌వెల్‌ చాంబర్‌లో దాచిపెట్టారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య,ఆమె ప్రియుడిని  అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులని పోలీసులు రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానిపట్(Panipat) జిల్లాలోని దహర్ గ్రామానికి చెందిన కర్మవీర్ (50) భార్య జ్యోతి అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం(Extramarital Affair) కొనసాగిస్తోంది. అయితే ప్రియుడితో కులకడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య..ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఫ్లాన్ చేసింది. జ్యోతి,శ్రీకాంత్ ఇద్దరూ..కర్మవీర్ ని హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. భర్తకు ఎప్పటిలాగే భోజనం పెట్టిన జ్యోతి..హత్య పథకంలో భాగంగా ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను ప్రేమికుడితో కలిసి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఛిద్రం చేయాలనే ఉద్దేశంతో గ్రామంలోని పొలంలో నిర్మించిన ట్యూబ్‌వెల్‌ చాంబర్‌లో దాచిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెల్వనట్లు జ్యోతి ఇంటికెళ్లింది. తన భర్త కనిపించకుండా పోయాడని డ్రామా మెదలుపెట్టింది.

Best dress : స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ పొందడానికి ఇలాంటి కలర్ డ్రెస్‌ని ఎంచుకోండి!

మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు

మృతుడి సోదరుడు ధరమ్‌వీర్... కర్మవీర్ ఆదివారం నుండి తప్పిపోయాడని, కుటుంబ సభ్యులు కర్మవీర్ కోసం చాలా వెతికారని, కానీ అతడి ఆచూకీ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశామ, ఆ తర్వాత పోలీసులు భార్యను ప్రశ్నించారు. అయితే ఆమె మాటలు పోలీసులకు అనుమానం కలిగించాయి. భార్య జ్యోతిని పోలీసులు తీవ్రంగా విచారించగా.. అసలు విషయం బయట పడింది. ఆ తర్వాత ప్రేమికుడు శ్రీకాంత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై హత్యానేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిద్దరినీ రెండు రోజుల పోలీసు రిమాండ్‌కు పంపింది.

OMG : ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి..15రోజులకే శవంగా..

మరోవైపు, ప్రేమ వ్యవహారం(Love Affair) ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి మరో యువతితో పెళ్లి(Marriage) చేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని అతడి ప్రియురాలి తండ్రి, సోదరుడు కాల్చిచంపారు. ప్రియురాలి తండ్రి కన్హయ్య, కొడుకుతో కలిసి తన ఇంటి సమీపంలోనే యువకుడిపై కాల్పులు జరిపాడు. తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో తీవ్రంగా గాయపడిన యువకుడిని బంధువులు మరియు గ్రామస్తులు ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్చారు. తలలో  అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. బీహార్ లో ఈ ఘటన జరిగింది.

First published:

Tags: Extra marital affair, Husband killed by wife, Wife kill husband

ఉత్తమ కథలు