హోమ్ /వార్తలు /క్రైమ్ /

Woman: మహిళతో యువకుడి వివాహేతర సంబంధం.. కొన్ని రోజుల తరువాత ఏమైందంటే..

Woman: మహిళతో యువకుడి వివాహేతర సంబంధం.. కొన్ని రోజుల తరువాత ఏమైందంటే..

మరీ ఇంత కర్కశంగా మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న వ్యక్తులకు, మోసం చేస్తున్న వ్యక్తులకు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇలాంటి విపరీత పోకడలు సమాజానికి మంచివి కాదని కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

మరీ ఇంత కర్కశంగా మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్న వ్యక్తులకు, మోసం చేస్తున్న వ్యక్తులకు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇలాంటి విపరీత పోకడలు సమాజానికి మంచివి కాదని కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో ఈ నెల 7న చమన్ సెహ్రవత్ అనే 40 ఏళ్ల యువకుడి హత్య జరిగింది. అతడిపై కాల్పులతో పాటు కత్తిపోట్లు ఉండటంతో.. బాధితుడిపై తీవ్రమైన పగతోనే నిందితులు ఈ రకంగా చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

వివాహేతర సంబంధాలు, అందుకు సంబంధించిన అనుమానాలు దారుణాలకు దారి తీస్తుంటాయి. అందుకే కొన్ని నేరాల విషయంలో పోలీసులు ఇలాంటి కోణాల్లోనూ దర్యాప్తు చేస్తుంటారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసును చేధించిన పోలీసులు.. ఈ హత్యకు వివాహేతర సంబంధం అనే అనుమానమే కారణమని తేల్చారు. తన భార్యతో సదరు వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ఆమె భర్త.. అతడిని చంపేశాడని పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ద్వారకా జిల్లాలో ఈ నెల 7న చమన్ సెహ్రవత్ అనే 40 ఏళ్ల యువకుడి హత్య జరిగింది. అతడిపై కాల్పులతో పాటు కత్తిపోట్లు ఉండటంతో.. బాధితుడిపై తీవ్రమైన పగతోనే నిందితులు ఈ రకంగా చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

దీంతో కేసును ఆ కోణంలో విచారించారు. దీంతో బాధితుడు ఎక్కడ నివాసం ఉన్నాడనే దగ్గరి నుంచి పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అక్కడ అతడి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ఆరా తీశారు. ఇందులో అతడితో పరిచయం ఉన్న చాలామంది నుంచి సమాచారం సేకరించారు. అతడి అలవాట్లు ఏ విధంగా ఉంటాయనే దానిపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అతడితో పరిచయం ఉన్న కొందరు అతడి గురించిన కొన్ని విషయాలు తెలిపారు. అతడికి అదే ప్రాంతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఈ కేసులు ఈ కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అతడితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై కన్నేశారు. అయితే ఆమె తీరు ఏ రకంగానూ అనుమానాస్పదంగా లేకపోవడంతో.. మృతుడి హత్యతో ఆమెకు ప్రమేయం ఉండకపోవచ్చని భావించారు. అయితే ఈ హత్య జరిగిన తరువాత ఆమె భర్త రాజీవ్ గుప్తా కనిపించకుండా పోవడంతో అతడికి ఈ హత్యతో సంబంధం ఉండొచ్చనే కోణంలో విచారణ మొదలుపెట్టారు.

Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..

Revanth Reddy: రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే.. ఆ రిపోర్ట్ ఆధారంగా కీలక నిర్ణయాలు

అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో అతడిని విచారించారు. మొదట ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించిన నిందితుడు.. ఆ తరువాత అసలు విషయం బయటపెట్టాడు. మృతుడు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతోనే అతడిని హత్య చేసేందుకు కుట్ర చేసినట్టు పోలీసులు తెలిపాడు. అతడిని ఏ రకంగా హత్య చేశామనే విషయాన్ని వివరించాడు. ఈ హత్య చేయడంతో తనకు సహకరించిన మరో ఇద్దరు పేర్లను పోలీసులకు చెప్పాడు. దీంతో ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరుపరిచారు.

First published:

Tags: Crime news, Extra marital affair

ఉత్తమ కథలు