Shocking Incident: ఇంత దారుణమా.. లవర్‌తో పెళ్లయిన మూడో రోజే.. మనిషనే వాడు ఎవడైనా ఇలా చేస్తాడా..

జ్యోతిమణి, ఇన్‌సెట్‌లో రాణి

సమాజంలో ప్రేమ వివాహల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు కానీ ఆ ప్రేమించిన వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పే అవుతుంది. ఆ తప్పుకు ఒక్కోసారి నిండు ప్రాణం కూడా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.

  • Share this:
    మదురై: సమాజంలో ప్రేమ వివాహల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు కానీ ఆ ప్రేమించిన వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పే అవుతుంది. ఆ తప్పుకు ఒక్కోసారి నిండు ప్రాణం కూడా బలవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. తమిళనాడులో ఓ యువతి విషయంలో సరిగ్గా అదే జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని పెళ్లయిన రెండో రోజే ఆమె భర్త సజీవ దహనం చేశాడు. ఈ షాకింగ్ ఘటన మదురై జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మదురై జిల్లా చోళవందాన్ రాయపురానికి చెందిన జ్యోతిమణి(23) అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన గ్లాడిస్ రాణి(20) అనే యవతికి రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా రోజులు గడిచే కొద్దీ ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. రాణి, జ్యోతిమణి షికార్లు చేసేవారు. అంతటితో ఆగని ఈ జంట పెళ్లికి ముందే పలుమార్లు శారీరకంగా కలిశారు. ఈ కారణంగా రాణి ఐదు నెలల గర్భం దాల్చింది. ఆమె తల్లిదండ్రులకు కూతురు గర్భం దాల్చిందన్న విషయం తెలిసి అందుకు కారణం ఎవరని నిలదీశారు. అప్పుడు రాణి, జ్యోతిమణి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. తమ కూతురిని జ్యోతిమణి గర్భవతిని చేశాడని, పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు జ్యోతిమణి కుటుంబానికి చెప్పగా రాణిని కోడలుగా చేసుకునేందుకు జ్యోతిమణి తల్లిదండ్రులు నిరాకరించారు.

    అయితే.. చివరకు పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో.. పెద్దల సమక్షంలో ఆగస్ట్ 2న రాణి, జ్యోతిమణి పెళ్లి జరిగింది. ఆగస్ట్ 4న తన భార్యను జ్యోతిమణి పెరియార్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రోజు మీ కూతురు కనిపించడం లేదని రాణి తల్లిదండ్రులకు జ్యోతిమణి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో.. సంతోషంగా కూతురికి పెళ్లి చేసి పంపిస్తే.. కనిపించకపోవడం ఏంటని చోళవందాన్ పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

    ఇది కూడా చదవండి: Very Sad: ఇంతకంటే పాపం మరొకటి ఉండదు.. ఈ ఆధార్ కార్డులో కనిపిస్తున్న ఆరేళ్ల పిల్లాడి జీవితం..

    ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. రాణి భర్త జ్యోతిమణిని విచారించిన క్రమంలో పోలీసులకు అతని తీరుపై అనుమానం కలిగింది. తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. రాణిని అవనియాపురం జాతీయ రహదారి వద్దకు తీసుకెళ్లి సజీవ దహనం చేసినట్లు జ్యోతిమణి చెప్పాడు. తన భార్యపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిందితుడు చెప్పడం గమనార్హం. పోలీసులు స్పాట్‌కు చేరుకుని చూడగా.. జ్యోతిమణి చెప్పింది నిజమేనని తేలింది. పోలీసులు జ్యోతిమణిపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సంతోషంగా అత్తారింట్లో అడుగుపెట్టిన తమ కూతురికి ఈ పరిస్థితి రావడం ఏంటని రాణి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
    Published by:Sambasiva Reddy
    First published: