హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: అప్పులు తీర్చేందుకు గల్ఫ్ దేశానికి వెళ్లిన భార్య.. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. చివరకు కథ ఇలా ముగిసింది..!

Andhra Pradesh: అప్పులు తీర్చేందుకు గల్ఫ్ దేశానికి వెళ్లిన భార్య.. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. చివరకు కథ ఇలా ముగిసింది..!

నిందితుల అరెస్టును చూపుతున్న పోలీసులు

నిందితుల అరెస్టును చూపుతున్న పోలీసులు

కుటుంబ అప్పులు తీర్చడం కోసం భార్య గల్ఫ్ దేశానికి వెళ్లింది. భర్త మాత్రం మద్యానికి బానిసయ్యాడు. అంతే కాకుండా ఓ స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం కూడా పెట్టుకున్నాడు. చివరకు..

ఉపాధి నిమిత్తం భార్య గల్ఫ్ దేశానికి వెళ్లింది. ఆమె పంపించే డబ్బుతో అప్పులను తీర్చి కుటుంబ అవసరాల నిమిత్తం దాచాల్సిన భర్త కాస్తా పెడదోవ పట్టాడు. ఆ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలు పెట్టాడు. మిత్రులతో కలిసి మద్యానికి బానిసయ్యాడు. అంతే కాకుండా స్నేహితుడి భార్యతో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్తా స్నేహితుడికి తెలిసింది. ఇదేంటని నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో భరించలేకపోయాడు. పక్కా ప్లాన్ తో మరో స్నేహితుడితో కలిసి హత్య చేశాడు. చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ గౌడ హస్టాల్ ప్రాంతంలో ఎస్కే ఉస్మాన్ అనే 36 ఏళ్ల వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అతడి భార్య మూడేళ్ల క్రితమే ఉపాధి నిమిత్తం ఖతర్ దేశానికి వెళ్లింది.

ఉస్మాన్ సరిగ్గా పనులకు వెళ్లకుండా జల్సాలు చేస్తుండటమే కాకుండా, భార్య పంపించే డబ్బును కూడా దుర్వినియోగం చేస్తుండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ శివకుమార్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండేవాడు. అతడితో కలిసి మద్యం తాగేవాడు. నెలకో, రెండు నెలలకో ఓసారి మాత్రమే భార్యకు ఫోన్ చేసేవాడు. అయితే తన భార్యతో ఉస్మాన్ సన్నిహితంగా ఉంటున్నాడని శివకుమార్ కు తెలిసింది. ఇదేంటని ఉస్మాన్ ను నిలదీశాడు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా, అదంతా వట్టి ప్రచారం మాత్రమేననీ ఎవరో కావాలని తనపై నిందలు వేస్తున్నారని చెప్పసాగాడు. అయినా నమ్మని శివకుమార్ అతడిపై కక్ష పెంచుకున్నాడు.

ఇది కూడా చదవండి: నాలుగు నెలల క్రితం పెళ్లి.. భార్య గర్భవతి.. ఆమె గురించి చివరిసారి వాట్సప్ స్టేటస్ పెట్టి మరీ టిక్ టాక్ టోనీ దారుణం..!

ఏప్రిల్ ఆరో తారీఖున మద్యం మత్తులో ఉన్న ఉస్మాన్ ను శివకుమార్ తన బైక్ పై ఎక్కించుకున్నాడు. దారిలో మరో స్నేహితుడు దామవరపు వినిత్ ను కూడా ఎక్కించుకున్నాడు. ముగ్గురూ కలిసి బాలాజీ నగర్ ఎస్బీఐ కాలనీలో ఉన్న వెంకటరెడ్డి లే అవుట్ దగ్గరకు వెళ్లారు. అక్కడే ఉస్మాన్ పై శివకుమార్ దాడి చేశాడు. తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకుంటావా అంటూ ఆగ్రహంతో చితకబాదాడు. పక్కనే ఉన్న బండరాయితో తలపై వేసి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఉస్మాన్ హత్య గురించి తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా శివకుమార్ ను, అతడికి సహకరించిన స్నేహితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Illegal affair, Wife kill husband

ఉత్తమ కథలు